దివ్యాంగుడు బుగ్గ బీరప్ప కుటుంబాన్నికి ప్రభుత్వం10లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలి!

May 25, 2024 - 20:56
 0  11
దివ్యాంగుడు బుగ్గ బీరప్ప కుటుంబాన్నికి ప్రభుత్వం10లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలి!

వలిగొండ 25 మే 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- వలిగొండ మండల పరిధిలోని  పులిగిల్ల గ్రామంలో వికలాంగుడు బుగ్గ బీరప్ప అనే వ్యక్తి అప్పుల బాధకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఆయన భౌతిక కాయానికి వికలాంగుల రాష్ట్ర, జిల్లా నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు.ఎన్ పి ఆర్ డి జిల్లా గౌరవ  అధ్యక్షులు మాటూరి బాలరాజు జిల్లా ఎన్ పి ఆర్ డి ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ..వలిగొండ మండలం పులిగిల్ల గ్రామంలో వికలాంగుడు బుగ్గ బీరప్ప చిన్న డబ్బా కిరాణం కొట్టు పెట్టుకొని వ్యాపారం చేసుకుంటూ..ఇల్లుకు అప్పు తెచ్చి కట్టడం జరిగింది. దానికి అప్పుల సుమారు 16లక్షల రూపాయలు అప్పయింది. అట్టి డబ్బులకు అసలు మిత్తి కట్టలేని పరిస్థితి కాబట్టి అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.  గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాలని ఎందుకంటే వికలాంగులకు విద్య వైద్యం ఉపాధి లేక జిల్లా వ్యాప్తంగా వికలాంగులు చాలా ఇబ్బందులు పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి వివిధ జిల్లాలోని వికలాంగుల అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలని బుగ్గ బీరప్ప కుటుంబానికి 10లక్షలు ఇచ్చి ఆ కుటుంబంలో ఉద్యోగం కల్పించాలని అట్లాగే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బుగ్గ చంద్రమౌళి వాకిటి వెంకటరెడ్డి,కొమ్మిడి లక్ష్మారెడ్డి, కళ్లెం సుదర్శన్ రెడ్డి వడ్డెమాని వెంకటయ్య దయ్యాల నరసింహ, వనం రాజు  లౌడియ రాజు వేముల చంద్రయ్య వేముల నాగరాజు వేముల జ్యోతి బాస్, చింతల శివ, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333