ఐలమ్మ అందరికీ స్ఫూర్తి
ఐలమ్మ అందరికీ స్ఫూర్తి
కె. ఆర్. ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కోదాడలో ఎన్.ఎస్.ఎస్ విభాగం ఆధ్వర్యంలో చాకలి (చిట్యాల)ఐలమ్మ జయంతి వేడుకలను ప్రోగ్రాం అధికారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.రమణారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ నేటి యువతకు, సమాజానికి ఐలమ్మ మార్గదర్శి అన్నారు. ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచింది చాకలి ఐలమ్మ అన్నారు. ఐలమ్మ పోరాటం మరువలేనిదని తొలి భూ పోరాటానికి నాందిగా నిలిచి, అనేకమంది ధైర్యంగా, విరోచితంగా, అన్యాయాన్ని ఎదిరించే విధంగా ధైర్యాన్ని నూరిపోసిందన్నారు. ఆనాటి దొరల గడీల వ్యవస్థపై తిరగబడి ధైర్యంగా గుదపలందుకొని సమాజాన్ని పీడించే దొంగలను తరిమికొట్టడంలో ముందున్న స్త్రీ ధైర్యశాలి అన్నారు. తెలంగాణ రైతాంగ పోరాటంలో ఆమె చూపిన తెగువ అందరికీ ఆదర్శమని, నేడు ప్రతి ఉద్యమంలో బహుజనులు భాగస్వాములు కావడానికి ప్రేరణగా ఐలమ్మ నిలిచిందని అన్నారు. ఐలమ్మ ఆకాంక్షలను ఆశయాలను నేటితరం ముందుకు తీసుకు వెళ్ళవలసిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు జి.లక్ష్మయ్య, ఆర్.పిచ్చిరెడ్డి, వేముల వెంకటేశ్వర్లు, జి. యాదగిరి, జి.నాగరాజు యం. ప్రభాకర్ రెడ్డి, ఆర్.రమేష్ శర్మ,
పి.రాజేష్,యం.రత్నకుమారి, బి.రమేష్ బాబు, జి.వెంకట రెడ్డి, పి.తిరుమల, యస్.గోపి కృష్ణ, యం.చంద్రశేఖర్,యస్. కె ముస్తఫా, నరసింహారెడ్డి, కె.శాంతయ్య, బి.అన్వేష్, ఆర్. చంద్రశేఖర్ గౌడ్,యస్. వెంకటాచారి, టి.మమత, డి.ఎస్. రావు, ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.