కామ్రేడ్ దొడ్డి కొమరయ్య 79వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన న్యూ డెమోక్రసీ నాయకులు

Jul 5, 2025 - 20:05
 0  7
కామ్రేడ్ దొడ్డి కొమరయ్య 79వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన న్యూ డెమోక్రసీ నాయకులు

దంతాలపల్లి 04 జులై 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద న్యూ డెమోక్రసీ నాయకులు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరవీరుడైన కామ్రేడ్ దొడ్డి కొమరయ్య 79వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తొర్రూరు డివిజన్ కార్యదర్శి ఊడుగుల లింగన్న నివాళులర్పించారు.ఈ సందర్భంగా లింగన్న మాట్లాడుతూ..పటేల్, పట్వారీ, భూస్వామ్య వ్యవస్థలు ప్రజలను ఎలా దోచుకున్నాయో వివరించారు. భూమి దున్నేవాడికే భూమి కావాలి అన్న ఆశయంతో దొడ్డి కొమరయ్య పోరాడారని గుర్తుచేశారు.ఆయన త్యాగం వల్లే ఈ రోజు తెలంగాణలో పేదలకు భూమి వచ్చిందన్నారు.ఈ ఆశయాల సాధన కోసం ఇప్పటికీ ఉద్యమం కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్.కె. సాజన్, వర్రే వెంకన్న,ఊడుగుల కొమరయ్య, లచ్చయ్య, ముత్తమ్మ,రమేష్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333