సిపిఎం పెన్ పహాడ్ మండల మహాసభలను విజయవంతం చేయండి

సిపిఎం పెన్ పహాడ్ మండల మహా సభలను జయప్రదం చేయండి..
నెమ్మాది వెంకటేశ్వర్లుపెన్ పహాడ్ తెలంగాణ వార్త:-
పెన్ పహాడ్ మండలంలోని లింగాల గ్రామంలో 7వ తేదిన జరుగు సిపిఎం మండల మహా సభల జయప్ప్రదానికి ప్రతీ ఒక్కరు సహకరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు కోరారు.. శనివారం నాడు లింగాల గ్రామం లో ఇంటి ఇంటి ప్రచారం లో బాగంగా 1996 లో సిపిఎం నుండీ మొదటి సారిగా ఎంపీపీ అయినా నల్లపు రామంజమ్మ, శ్రీను దంపతులను మర్యాద పూర్వకంగా కలిసి అభినందించారు..ఈ సంధర్బంగా నెమ్మాది మాట్లాడుతూ ఎన్నో త్యాగాల చరిత్ర కలిగిన సిపిఎం ను తెలిసో తెలియకో వీడిన పూర్వ కమ్యూనిస్టులందరు తిరిగీ మాతృ సంస్థ లో చేరాలని కోరారు..బూర్జువా వర్గ పార్టీలు అధికారం కోసం లేని పోనీ వాగ్దానాలు చేసి అధికారం లోకి వచ్చిన తర్వాత వాగ్దానాలు అమలు చేయలేక గుప్పి గంతలు పడుతున్నాయని ఆయన అన్నారు... సిపిఎం అధికారం ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలు తీసుకోని పోరాటాలు చేస్తున్నారని ఆయన అన్నారు..
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కుల మత ప్రాంతీయ విభేదాలు సృష్టించి ప్రజల ఐక్యతను దెబ్బ తీస్తున్నారని ఆయన అన్నారు.. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయని, పేదల కొనుగోలు శక్తి తగ్గి కార్పొరేటు ఆదాయలు రెట్టింపు అయ్యాయని అన్నారు.. తెలంగాణ ప్రభుత్వం చేసిన వాగ్దానాలు అమలు చేసి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు.. లేకుంటే పోరాడక తప్పదనారు.. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి రణపంగి కృష్ణ, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వీరాబోయిన రవి, గుంజ వెంకటేశ్వర్లు, మడ్డి అంజిబాబు, సిపిఎం శాఖ కార్యదర్శి బుచ్చి రాములు తదితరులు పాల్గొన్నారు