సంఘటితంగా ఉండి సమస్యలు పరిష్కరించుకోవాలి

Apr 7, 2024 - 20:28
 0  5
సంఘటితంగా ఉండి సమస్యలు పరిష్కరించుకోవాలి

ప్రతి జర్నలిస్ట్‌కు టీజేఎస్‌ఎస్‌ భరోసా కల్పిస్తుంది

 :జాతీయ అధ్యక్షులు రంగనాయకులు

సూర్యాపేట : సంఘటితంగా జర్నలిస్టులు సమస్యలు పరిష్కరించుకోవాలని, ప్రతి జర్నలిస్ట్‌కు టీజేఎస్‌ఎస్‌ భరోసా కల్పిస్తుందని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ తెలుగు జర్నలిస్ట్‌ సంక్షేమ సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పబ్లిక్‌ క్లబ్‌లో జరిగిన ఆ సంఘం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మృతి చెందిన ప్రతి జర్నలిస్ట్‌కు 20 లక్షలను ఇన్సురెన్స్‌ ద్వారా అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా అంబులెన్స్‌ ఖర్చులు, మట్టి ఖర్చులతో సహా అందజేస్తున్నట్లు తెలిపారు. సభ్యత్వం తీసుకొని సంఘాన్ని బలోపేతం చేయాలని ఆయన కోరారు. అనంతరం నూతన కమిటీని ప్రకటించారు. అధ్యక్షులుగా మడూరి బ్రహ్మచారి, ఉపాధ్యక్షులుగా మామిడి శంకర్‌, కార్యవర్గ సభ్యులుగా పడిసిరి వెంకట్‌, వెలగాని మహేష్‌ను ఎన్నుకున్నారు. అంతకుముందు రంగనాయకులును పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గజ్జెల శ్రీనివాస్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్ణాకర్‌, సహాయ కార్యదర్శులు గడ్డం సత్యనారాయణ, గిలకత్తుల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333