ఘనంగా గ్రాడ్యుయేషన్ డే సెలెబ్రేషన్స్ వేడుకలు

Mar 30, 2024 - 22:50
 0  10
ఘనంగా  గ్రాడ్యుయేషన్ డే సెలెబ్రేషన్స్ వేడుకలు
ఘనంగా  గ్రాడ్యుయేషన్ డే సెలెబ్రేషన్స్ వేడుకలు
ఘనంగా  గ్రాడ్యుయేషన్ డే సెలెబ్రేషన్స్ వేడుకలు
ఘనంగా  గ్రాడ్యుయేషన్ డే సెలెబ్రేషన్స్ వేడుకలు

ఖమ్మం నగరంలో ముస్తఫా నగర్ డా" శీలంస్ ఎడ్యుకేషనల్ సొసైటీ తెలంగాణ విద్యారణ్య హై స్కూల్ లో గ్రాడ్యుయేషన్ డే సెలెబ్రేషన్స్ వేడుకలు ఘనంగా జరిగాయి . స్కూల్ ప్రిన్సిపాల్ ఎస్.కె.ఆఫ్జాల్ పాషా మరియు కరస్పాండెంట్ శ్రీమతి శీలం శ్రీవిద్య వారి ఆధ్వర్యంలో లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిదులుగా డా" శీలమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ డాక్టర్ శీలం పాపారావు , మాజీ కార్పొరేటర్ మండదపు మనోహర్ , శ్రీ రక్ష హాస్పిటల్ అధినేత డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు , జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారుపల్లి సురేష్ , ప్రముఖ అడ్వకేట్ కొల్లిపాక శ్రీదేవి , సిటీ కేబుల్ వ్యవస్థాపకులు టీ .రామకృష్ణ , డాక్టర్ షేక్ ఏడుకొండలు , సొసైటీ వైస్ చైర్మన్ శీలం నాగరాజు లు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్ననాటి నుండే పిల్లలకు మంచి గుణాలు అలవాటుపరచి మంచి మార్గంలో నడిపించాలని , సెల్ ఫోన్లకు మరియు టీవీలకు దూరంగా ఉంచాలని అలాగే పిల్లలకు విద్యపై మక్కువ కలిగే విధంగా తల్లిదండ్రులు చూడాలని సూచించారు . పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి విద్య అని తెలియజేశారు .ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ఏకడమిక్ ఎక్సలెన్సీ అవార్డులు , గోల్డ్ మెడల్స్ , ప్రశంసా పత్రాలు అందించడం జరగింది . ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం అతిథులను ఘనంగా సత్కరించడం జరిగింది . ఈకార్యక్రమంలో లో స్కూల్ టీచర్స్ , సిబ్బంది మరియు పేరెంట్స్ పాల్గొన్నారు .

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333