సా మాజక రాజకీయ ఆర్థిక అంశాలపై   పల్లె నుండి డిల్లీ దాకా చర్చజరగాలి.

Oct 13, 2024 - 21:05
Nov 14, 2024 - 22:26
 0  4
సా మాజక రాజకీయ ఆర్థిక అంశాలపై   పల్లె నుండి డిల్లీ దాకా చర్చజరగాలి.

అప్పుడే పౌర సమాజం బాధ్యథా  రాహిత్యం,  పాలకుల అణచివేత , పెట్టుబడిదారుల దోపిడీ విధానం  ప్రజలకు అవగతమవుతుంది  .ప్రజల భాగస్వామ్యంతో ప్రజాస్వామ్యం   వర్ధిల్లడానికి వీలు అవుతుంది.
వడ్డేపల్లి  మల్లేషము
సామాన్య ప్రజలు,  కార్మికులు, కర్షకులు, చేతివృత్తుల వాళ్ళు, వీ ది వ్యాపారులు, వలస కూలీలు,  అన్నింటికీ దూరంగా వెలివేయబడ్డ ఆదివాసి  ప్రజానీకం తమ పనిలో నిమగ్నమై సమకాలీన సమాజంలో జరుగుతున్న విషయాలను పట్టించుకోని కారణంగా  ప్రజల అచేతనత్వాన్ని ఆసరాగా చేసుకున్న ప్రభుత్వాలు  ప్రజల పైన స్వారీ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.  ప్రశ్నించే వాళ్ళు లేనప్పుడు పాలకులు చేసేదే చట్టం న్యాయం అవుతుంది . ఉగ్రవాద ముఠాలు, పారిశ్రామిక పెట్టుబడిదారీ దోపిడీ వర్గాలు  ఇదే అదునుగా భావించి 
ప్రభుత్వ మద్దతును సాధించడానికి  సామాన్య ప్రజలకు  ద్రోహం తలపెట్టడానికి ప్రణాలికలు రచిస్తుంటాయి . రాజ్యాంగపరంగా అందరికీ సమాన అవకాశాలు  లభించవలసి ఉన్నప్పటికీ   కూడా  సంపద కొద్దిమంది చేతుల్లోనే  జమ కావడం పాలనలో ఉన్నటువంటి  సిద్ధాంతం ఆచరణకు గల పెద్ద లోపం.  40 శాతం సంపద కేవలం 1 శాతం    సంపన్న వర్గాల చేతిలో బంధీ  అయినా కూడా మనం ప్రశ్నించడం లేదంటే మన చైతన్యం ఏపాటిదొ అర్థం చేసుకోవచ్చు . ఈ సందర్భంలోనే దేశవ్యాప్తంగా దేశంలో జరుగుతున్న సంఘటనలు,పరిపాలనా పట్ల చర్చ జరగాల్సిన  అని వార్య పరిస్థితులు  ఏర్పడుతున్నాయి.
        ఏ   అంశాలపై చర్చ జరగాలి?:-
*********
  ప్రజాస్వామ్యం అంటే ఏమిటి భారతదేశంలో  ప్రజాస్వామ్యం వర్ధిల్లుతున్నదా ? ప్రజలకు గల రాజ్యాంగ హక్కులు  ఆచరణలో ఎదుర్కొంటున్న చిక్కులు,  ,కుల మత వివక్షత  కులతత్వం మతతత్వం  జడలు విప్పడం,  పాలకులు చేస్తున్న వాగ్దానాలు  ప్రలోభాలు  ప్రజలను ఎలా బలి పశువులను చేస్తున్నాయి  ?,నాణ్యమైన ఉచిత విద్య వైద్యం ఈ దేశంలో ప్రజలకు ఎందుకు  లభించడం  లేదు ?, అన్నపురాసులు ఒకచోట ఆకలి మంటలు ఒకచోట ఎందుకు ఉన్నాయి  ?,ఆర్థిక అసమానతలు అoత రాలకు కారణం ఏమిటి ?, పాలకులు ఇస్తున్న హామీలు, చేస్తున్న వాగ్దానాలు,  ప్రలోభాలు  ప్రజలను వంచించడానికేనా?, . పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు  ప్రభుత్వ మద్దతుతో  సంపన్న వర్గాల జాబితాలో చేరుతుంటే  కనీస అవసరాలకు నోచుకోని ప్రజల సంఖ్య  దినదినం పేరుగుతుంటే  సామాజిక న్యాయం ఏది  ?,ప్రజల పక్షాన హక్కుల కోసం పోరాడుతున్న  ప్రజా సంఘాలు  హక్కుల కార్యకర్తలు మేధావులు బుద్ధి జీవులను  నిర్బంధించడంలోని ఔచిత్యం  ఏమిటి?,  విచారణ ఖైదీల పేరుతో దశాబ్దాలు గడపడం  రాజ్యాంగ విరుద్ధం కాదా ?, మహిళలపై నేరాలలో  151 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఉంటే  వారిని ఎందుకు శిక్షించరు? , గత లోక్సభలో 83% రాజ్యసభలో 36%  నేర చరిత్ర ఉన్నవారు  ఈ దేశాన్ని ఎలా పరిపాలించగలరు ?వంటి అంశాలు కీలకమైనవి. ఎరువులు క్రిమిసంహారక మందులతో విషతుల్యం అవుతున్న  భూమి, ప్రకృతి, పర్యావరణాన్ని  కాపాడుకోవడంలో పాలకుల బాధ్యత లేదా? పౌర సమాజం  తమ కర్తవ్యం నిర్వహిస్తున్నదా?, పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం  మాఫీ చేసిన 16 లక్షల కోట్ల రూపాయల సంగతి ఏమిటి ?- విద్య, వైద్యం ప్రభుత్వ ఆధ్వర్యంలో నాణ్యమైనది  ఎందుకు లభించడం లేదు?-  తమ సంపాదనలో 60 -70 శాతం ఈ రెండు అవసరాలకే ఖర్చవుతుంటే  ప్రజలు పాలకులను ఎందుకు ప్రశ్నించడం లేదు  ?--ప్రజా ఉద్యమాలు అప్పుడప్పుడు వస్తున్నా    ప్రజల నిర్లక్ష్యం బాధ్యతారాహిత్యం కారణంగా  విఫలం కావడం నిజం కాదా?- కనీస   అవసరాలను  తీర్చుకోగల మానవాభివృద్ధిని  సామాన్య ప్రజలు ఎందుకు సాధించడం లేదు ?-- దా రిద్ర రేఖ దిగువన ఇప్పటికీ 20 శాతం ఎందుకు ఉన్నారు? వంటి అంశాలతో పాటు  పాలకుల  నిర్లక్ష్యం , స్వప్రయోజనాల పైన సుదీర్ఘ చర్చ జరగాలి.  పౌర సమాజం కూడా తమ బాధ్యతలను  విస్మరిస్తున్న సందర్భాలను ఆత్మవిమర్శ చేసుకోవడానికి వేదిక కావాలి.
ప్రజాసంఘాలదే కీలకపాత్ర:-
********
            సామాన్యుల నుండి  విద్యావంతులు బుద్ధి జీవులు మేధావులు, కార్మికులు కర్షకులు  ప్రజా సంఘాలతో కూడినటువంటి  సంస్థలు  ఈ చర్చకు బాధ్యత వహించాలి . ప్రజలను ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ సమీకరించి  ఆలోచన రేకెత్తించి ప్రశ్నించే ధోరణిని అలవాటు చేయాలి  .తమ నిత్య జీవిత అవసరాలు,  కుటుంబ సంబంధాలు,  ప్రజలు ఎదుర్కొంటున్న అధిక ధరల పైన  చర్చ జరిగినప్పుడు ఆసక్తిగా పాల్గొంటారు . రాసుకున్నదేమిటి నిజ జీవితంలో ప్రజలకు ఎందుకు చేరడం లేదు అనే అంశంపై  మర్మాన్ని విప్పి చెప్పాలి  .ఎక్కడికక్కడ  మీడియా ద్వారా ప్రకటనలు చేయడం , రాజకీయ పార్టీలను ప్రశ్నించడం,  ప్రతిపక్షాలను  నిలదీయడం,  అధికార పార్టీకి చెందిన శాసనసభ్యులు మంత్రులు  నాయకులను  ఇచ్చిన హామీలు వాగ్దానాల సంగతి ఏమిటి అని  డీ కొనడం  ద్వారా  ప్రజా సంఘాలు  ఉద్యమకారుల కమిటీలు  తమ క్రియాశీలక పాత్రను పోషించాలి.  గ్రామ మండల జిల్లా స్థాయిలో  చర్చలు సంప్రదింపులకు ప్రత్యేక కమిటీలు ఏర్పడినప్పుడే ఇది సాధ్యమ వుతుంది. ప్రజలలో జాగరూ కత పెరగడానికి,  బాధ్యతలను గుర్తింప చేయడానికి, హక్కులకై పోరాటానికి,  పాలకులను నిలదీయడానికి,  పౌర సమాజం బాధ్యతలను కూడా  గుర్తింపచేయ డానికి ఈ చర్చలు ఎంతో తోడ్పడతాయి  .సామాజిక స్పృహతో కూడుకున్న  ఈ చర్చలు  వ్యూహాత్మకంగా జరిగినప్పుడే  ఆశించిన ఫలితాలు కొంతమేరకైనా  సమకూరుతాయి.మెరుగైన సమాజం,సమసమాజస్థాపన నినాధాలుగా మిగిలిపోకూడదంటే బలమైన ప్రజాఉద్యమాలు రావాలి.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333