తెలంగాణ సాయుధ పోరాటానికి చరిత్ర లిఖించిన నల్ల నరసింహులు
వడ్డేపల్లి మల్లేశం అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు.
1946 జూలై 4వ తేదీన దొడ్డి కొమురయ్య అమరత్వంతో ఉద్యమం సాయుధ పోరాట రూపాన్ని అందుకోవడంలో తెగువ చొరవ చూపిన నల్ల నరసింహులుది కూడా దొడ్డి కొమురయ్య స్వగ్రామం కడివెండి కావడం గమనించదగినది . కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా ఉంటూనే ఆంధ్ర మహాసభ కార్యక్రమాలను ఆసక్తిగా గమనించిన నల్ల నర్సింహులు స్వగ్రామం కడివెంటలో ఉద్యమాన్ని ప్రారంభించి కార్యకర్తలను పోగు చేసి చూపిన తెగు వ చరిత్రాత్మకమని,పాఠ్యపుస్తకాలలో ప్రచురించడం ద్వారా ఈనాటి యువతరానికి ఆయన చరిత్ర తెలియ చేయవలసిన అవసరం ఉందని అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు వడ్డేపల్లి మల్లేశం అన్నారు .
బుధవారం,2024 అక్టోబర్ 2వ తేదీన నల్ల నరసింహులు 98 వ జయంతి సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ తన భార్య వజ్రమ్మను కలుపుకొని ఉద్యమాన్ని నిర్మించడంలో క్రి యా శ్రీల భూమిక పోషించినాడని, చేనేతకార్మికునిగా కుటుంబ పరిస్థితులు అనుకూలించని పరిస్థితిలో ఉన్నప్పటికీ కుటుంబం కంటే ప్రజలే ముఖ్యమని భావించి రజాకార్ల దౌస్ట్యా నికి, దేశముకుల అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడిన దన్యజీవిగా నల్ల నరసింహులును ఈనాటి తరం గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఉద్యోగ అవకాశం చిక్కినా చిన్ననాడే తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం తనపై పడినా వాటి నుండి బయటపడి పోరాట మార్గాన్ని ఎంచుకున్న తెలంగాణ ఉద్యమకారుడు నల్ల నరసింహులు జీవితాన్ని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయనడానికి ఆయనే నిదర్శమని వడ్డేపల్లి మల్లేశం అన్నారు.. ఉద్యమ క్రమంలో రజాకార్లను వారికి సహకరించిన వారిని హత్య చేసినాడనే ఆరోపణ పైన న్యాయస్థానం ఉరిశిక్ష విధించినప్పటికీ అనేకసార్లు తప్పించుకొని ఉద్యమాన్ని నడిపించిన కడివెoడి టైగర్ గా పేరుగాంచిన ఆయనకు అంతర్జాతీయ స్థాయి సమాజం నుండి భారత రాష్ట్రపతికి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఉరిశిక్షను రద్దు చేయడం జరిగినట్లు ఉద్యమ కార్యాచరణ ముందు ఎలాంటి శిక్షలకైనా భయపడకూడదు అనే భగత్ సింగ్ ఆదర్శాలను పునికి పుచ్చుకున్న నల్ల నరసింహులు జీవితం తెరిచిన పుస్తకం అని "తెలంగాణ సాయుధ పోరాటం నా అనుభవాలు" పేరుతో వ్రాసిన పుస్తకం అధ్యయనంతో పాటు
నేటి తరం పరిశోధకులు మరింత లోతైన పరిశోధన చేయాల్సి ఉందని , భార్యతో సహా కుటుంబాన్ని కూడా ఉద్యమానికి అంకితం చేసినందుకు ఆ తెగువను మనలో నింపుకోవాల్సిన తరుణం ఆసన్నమైనదని వడ్డేపల్లి మల్లేశం ఆయనకు నివాళి అర్పించారు .
వడ్డేపల్లి మల్లేశం
అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ,హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ .