సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులకు సంఘీభావం తెలిపిన నిరవధిక సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేసిన.

జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ.

Jan 3, 2025 - 19:44
 0  7
సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులకు సంఘీభావం తెలిపిన నిరవధిక సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేసిన.

జోగులాంబ గద్వాల్ 3 జనవరి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల జిల్లాలో సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ఉద్యోగుల నిరవధిక సమ్మె గత 25 రోజులుగా కొనసాగుతోంది. తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలని, వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు నిర్వహిస్తున్న నిరసన సమ్మెకు జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ సంఘీభావం తెలిపారు... అంతకుముందు అక్కడ ఏర్పాటు చేసిన సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటాన్నికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు... అనంతరం జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ మాట్లాడుతూ సమ్మగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు గత 25 రోజుల నుండి తమన్ న్యాయపరమైన డిమాండ్లతో చేస్తున్నటువంటి నిరసన సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు.. గత ప్రభుత్వంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి హామీలను తీర్చలేదని, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లో ఉద్యోగులకు పూర్తి న్యాయం చేకూరుతుందని హామీ ఇచ్చారు... నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి సహకారంతో సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం రాష్ట్ర మంత్రివర్గంతో చర్చించి తమ నాయకుల మీద డిమాండ్లను అమలు చేయడానికి నా వంతు కృషి ఉంటుందని సరితమ్మ ఉద్యోగస్తులకు హామీ ఇచ్చారు.. నిరసన సమ్మె ద్వారా విద్యార్థులకు పూర్తి సిలబస్ పూర్తి కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర నష్టానికి గురవుతారని, పదవ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులపై ప్రభావం పడకుండా సర్వ శిక్ష అభియాన్ న్ ఉద్యోగులు నిరసన సమ్మె విరమించి విధులలో హాజరుకావాలని ఉద్యోగస్తులకు సూచించారు... దీంతో ఉద్యోగస్తులు సానుకూలంగా స్పందిస్తూ తమ రాష్ట్ర కమిటీ సభ్యులతో సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగస్తులు మాట్లాడి విరమించడానికి కృషి చేస్తామన్నారు.... ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మమ్మద్ ఇసాక్,అల్వాల రాజశేఖర్ రెడ్డి, భాస్కర్ యాదవ్,డిటిడిసి నర్సింహులు,పాతపాలెం ఆనంద్ గౌడ్, పటేల్ శ్రీనివాసులు,జమ్మిచేడు ఆనంద్,కృష్ణమూర్తి,తిమోతి,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.తిరుమలేష్,చేపల చిన్న,గార్లపాడు మల్లేష్,ఓబులోనిపల్లి పరుశరాముడు,వెంకటన్న,తిమ్మప్ప తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333