పిల్లలమర్రి చెన్నకేశవస్వామికి పుష్పాలంకరణ సేవ
సూర్యాపేట రూరల్,(పిల్లలమర్రి) జూన్06: మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామికి శుక్రవారం సందర్భంగా అర్చకుడు ముడుంబై రఘువరన్ ఆచార్యులు ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు.ఆలయంలో స్వామికి శుక్రవారం విశేషంగా అలంకరణ కుంకుమార్చనలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేస్తారు.అర్చకుడు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధిలో భక్తుల సహకారం అందించాలని విశేష పూజల సందర్భాలలో ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ఉమ్మెంతల హరిప్రసాద్, ఛైర్మెన్ గుకంటి రాజబాబు, భక్తులు సోమగాని లింగస్వామి అర్చన, ముడుంభై సారిక, గుజ్జ శ్రీదేవి, గవ్వ విజయలక్ష్మీ, మెరెడ్డి సువర్ణ,గవ్వ అహల్య,అంకం భిక్షం మల్లీశ్వరి తదితర భక్తులు పాల్గొన్నారు...