శ్రీశ్రీశ్రీ జమ్ములమ్మ మరియు పరుశురామ స్వామి దేవస్థానము ఉండి లెక్కింపు
జోగులాంబ గద్వాల 3 జూలై 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల. తేది:03-07-2024 - బుదవారము రోజున శ్రీశ్రీశ్రీ జమ్ములమ్మ మరియు పరశురామస్వామి దేవస్థానము యందు "హుండీల లెక్కింపు" కార్యక్రమం దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిశీలకురాలు శ్రీమతి వెంకటేశ్వరి మరియు ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రీ ఆర్. పురెంధర్ కుమార్, ఆలయ చైర్మన్ శ్రీమతి గాయత్రి సతీష్ కుమార్, ఆలయధర్మకర్తలు,ఆలయ సిబ్బంది,భక్తుల సమక్షంలో నిర్వహించగా "3 నెలల 12రోజులకు" గాను రూ" 23,67,518=00 అక్షరాల "ఇరవైమూడు లక్షల అరవైఏడువేల ఐదువందల పద్దెనిమిది" మాత్రమే ఆదాయం వచ్చినదని ఇందులోనోట్ల ద్వార రూ: 22,54,050=00 రాగా, నాణెముల ద్వార రూ: 1,13,468=00 వచ్చినది.
మొత్తం హుండీ లెక్కింపు ద్వార రూ:23, 67, 518=00 వచ్చినదని, మరియు "మిశ్రమ బంగారం 000-050-000 గ్రాములు , మిశ్రమ వెండి 007-050-000 గ్రాములు" వచ్చినదని తెలియజేయుచున్నాము. R.పురెంధర్ కుమార్ కార్యనిర్వాహణాధికారి మరియు శ్రీమతి గాయత్రి (ఆలయ చైర్మన్) మరియు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు. --: శ్రీ జమ్మలమ్మ మరియు పరశురామ స్వామి దేవస్థానం గద్వాలటౌన్ (జమ్మిచేడు) జోగులాంబ గద్వాల జిల్లా వారు తెలియజేశారు.