బొడ్డు శ్రీధర్ రెడ్డి హత్య వెనుక ఎవరున్నారు?

Jan 18, 2025 - 19:55
Jan 18, 2025 - 20:01
 0  59
బొడ్డు శ్రీధర్ రెడ్డి హత్య వెనుక ఎవరున్నారు?

18-01-2025 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం:-  చిన్నంబావి మండల ప్రాంతంలో రోడ్డుపై ధర్నాకు దిగిన బిజెపి,బిఆర్ఎస్ అఖిలపక్ష  నాయకులు.చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన లక్ష్మీ పల్లి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ నాయకుడు బొడ్డుశ్రీధర్ రెడ్డి ని హత్య చేసిన నిందితులను పట్టుకోకుండా  పట్టుకోండి అంటే ఈ చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం శాంతియుత ధర్నాలు చేస్తున్న బిజెపి పార్టీ నాయకులను మరియు అఖిలపక్ష పార్టీల నాయకులను అక్రమ అరెస్టులు చేయిస్తున్నది. చిన్నంబావి మండలం లో ఒక మంత్రి ఉండి కూడా ఇలాంటి హత్యలు చేస్తున్న వారిని వెనుకేసుకొస్తూ ఉన్నారు అని వాపోతున్నారు. ఈ హత్య ముమ్మాటికి జూపల్లి అనుచరులే చేశారని అందుకే జూపల్లి పోలీస్ వ్యవస్థను నోరు మూయించి నిందితులను అరెస్టు చెయ్యనీయకుండా చేస్తున్నారని చిన్నంబావి మండల ప్రజానీకానికి అర్థమయింది అని అంటున్నారు.ప్రజలారా శ్రీధర్ రెడ్డిని చంపి సంవత్సరం అవుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చంపిన వారిని వదిలిపెట్టి, *సిగ్గులేకుండా శ్రీధర్ రెడ్డి ని చంపిన నిందితులను అరెస్టు చేయమని ధర్నాలు చేస్తున్న వారిని అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రతీకార ప్రభుత్వంగా ప్రజలను నయవంచన చేస్తున్నది. రేపు జరగబోయే స్థానిక సంస్థలు ఎన్నికలలో ఈ కాంగ్రెస్కు పార్టీని మీయొక్క ఓటుతో బహిష్కరించాలి. ఈ యొక్క ధర్నాలో నాగర్ కర్నూల్ ఇంచార్జ్  ఎల్లేనిసుధాకర్ రావు, రాష్ట్ర యువ నాయకుడు బేక్కెం  ధారాసింగ్,  బిజెపి సీనియర్ నాయకుడు కొత్త వెంకట్రెడ్డి, చిన్నంబావి మండల అధ్యక్షుడుశ్రీధర్ రెడ్డి, చిన్నంబావి మండల బి ఆర్ ఎస్ మండల మాజీఎంపీపీ సోమేశ్వరమ్మ, మాజీ జెడ్పిటిసి వెంకటరమణమ్మ, పెద్దమారు గ్రామ సర్పంచ్ మాజీ  శ్రీధర్ రెడ్డి, వివిధ గ్రామాలకు చెందిన నాయకులు అధిక  సంఖ్యలో పాల్గొనడం  జరిగింది.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State