ఆందోల్ నియోజకవర్గం మునిపల్లి మండలంలో పర్యటన. 

Jan 20, 2025 - 21:16
Jan 21, 2025 - 00:08
 0  38
ఆందోల్ నియోజకవర్గం మునిపల్లి మండలంలో పర్యటన. 
ఆందోల్ నియోజకవర్గం మునిపల్లి మండలంలో పర్యటన. 
ఆందోల్ నియోజకవర్గం మునిపల్లి మండలంలో పర్యటన. 

సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ అండ్ పిజి కాలేజ్ ఫర్ ఉమెన్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలను ఆకస్మిక తనిఖీ

రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

అందోల్ (మునిపల్లి) తెలంగాణవార్త ప్రతినిధి :- సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో  మునిపల్లి మండలం బుదేరా గ్రామంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ అండ్ పిజి కాలేజ్ ఫర్ ఉమెన్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలను సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వర్యులు దామోదర రాజనర్సింహ పరిశీలించారు. 

కళాశాలలో జరుగుతున్న అదనపు తరగతుల భవన నిర్మాణాలను, డ్రైనేజీ వ్యవస్థను, క్రీడా మైదాన నిర్మాణ పనులను, కళాశాల కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను, అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి దామోదర్ రాజనర్సింహ పరిశీలించారు.

అనంతరం, తాటిపల్లి గ్రామంలోనీ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ను పరిశీలించారు.కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులతో పాఠశాల అభివృద్ధిపై చర్చించారు. పాఠశాల అభివృద్ధి కి అవసరమైన మౌలిక సదుపాయాలను సిఎస్ఆర్ నిధులతో చేపడతామన్నారు. కేజీబీవీ పాఠశాలలో వంటగదిని పరిశీలించారు.

పాఠశాల విద్యార్థులకు విశాలమైన డైనింగ్ హాల్ నిర్మాణం, డిజిటల్ క్లాస్ రూమ్ లో ఏర్పాటు, ఆర్ ఓ ప్లాంట్ , అదనపు తరగతి గదుల నిర్మాణం, పేరెంట్స్ వెయిటింగ్ హాల్ నిర్మాణ పనులను సిఎస్ఆర్ ఫండ్స్ తో చేపడుతామన్నారు దామోదర్ రాజనర్సింహ.

రాయికోడు మండలంలోని నూతనంగా ఏర్పాటుచేసిన అక్షయ హాస్పిటల్ ను మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు.ఆందోల్ నియోజకవర్గం లో విద్య, వైద్య రంగాల బలోపేతానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. నియోజకవర్గంలో బాలికల విద్య ప్రోత్సాహానికి చర్యలు చేపట్టామని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333