రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన
పెయింటింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహణ.
తిరుమలగిరి 20 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలలో భాగంగా తిరుమలగిరి మండల పరిధి మోడల్ స్కూల్ నందు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా విద్యార్థులకు రోడ్డు భద్రతపై పెయింటింగ్ పోటీలు వ్యాసరచన పోటీలు నిర్వహించి వారికి రోడ్డు భద్రత పట్ల మరింత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై వెంకట్ రెడ్డి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి, సామాజిక అంశాల పట్ల అవగాహన కలిగి ఉండాలని కోరారు. రోడ్డు ప్రయాణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు తెలపాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉన్నదని కోరారు. బహుమతులుగా తల్లిదండ్రులకు హెల్మెట్ అందించడం లాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వ్యసనాలకు దూరంగా ఉండి ఉన్నత స్థాయికి ఎదగాలని కష్టపడి చదువుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సంజీవ్ పోలీస్ సిబ్బంది హరిబాబు, సైదులు ,సలీం ,అంతయ్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు