గ్రామ అభివృద్ధి నా లక్ష్యం  సర్పంచ్ చిత్తలూరి సోమనారాయణ

Dec 28, 2025 - 17:43
 0  77
గ్రామ అభివృద్ధి నా లక్ష్యం  సర్పంచ్ చిత్తలూరి సోమనారాయణ

అడ్డగూడూరు 27 డిసెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని చిర్రగూడూర్ గ్రామంలో సర్పంచిగా నూతనంగా ఎన్నికై గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ బలపరిచినందుకు నన్ను నమ్మి అత్యధిక మెజార్టీతో గెలిపించిన నా చిర్రగూడూర్ గ్రామ ప్రజలందరికీ శుభాభివందనాలు.నాపై నమ్మకంతో ఓటు వేసిన నన్ను గెలిపించిన ప్రతి ఒక్క ఓటర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని నూతన సర్పంచిగా ఎన్నికైన చిత్తలూరి సోమనారాయణ శనివారం నాడు విలేకరుల సమావేశంలో  అన్నారు.చిర్రగూడూర్ గ్రామం అభివృద్ధి పథంలో తీసుకపోవుటకు కచ్చితంగా కృషి చేస్తానని అదేవిధంగా ఎప్పటినుండో ఉన్న బొడ్రాయి ప్రతిష్టాపన గత పాలకులు నిర్లక్ష్యం చేశారు.అట్టి బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని  గ్రామ ప్రజలందరి సహకారంతో ఘనంగా బొడ్రాయి పండుగ నిర్వహిస్తామని అన్నారు. దాంతో పాటుగా గత పాలకులు చేసిన ఇసుక దోపిడీని అరికట్టుటకు మా ఎమ్మెల్యే మందుల సామేలు సహకారంతో కట్టడి చేస్తానని,గ్రామ ప్రజలకు అందరికీ పత్రికముకంగా  తెలియజేస్తున్నానని ఆయన అన్నారు.అదేవిధంగా సిసి రోడ్లు,డ్రైనేజీ,పూర్తిగా ప్రక్షాళన చేస్తానని తెలియజేశారు. జానకిపురం నుండి చిర్రగూడూరు వరకు గల లింకు రోడ్డును ఎమ్మెల్యే సహాయ సహకారాలతో బీటీరోడ్డుగా పూర్తి చేస్తానని అన్నారు.గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని మండలంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతనాని అన్నారు.అదేవిధంగా  చదువులో ముందు ఉండే విద్యార్థులను ప్రోత్సహిస్తూ..వారికి అండగా ఉంటానని అన్నారు.అంతేకాకుండా గ్రామ యువకుల సహకారంతో ఒక లైబ్రరీ ఏర్పాటు చేస్తానని అన్నారు,అంతేకాకుండా గ్రామపంచాయతీకి పక్కా భవనం లేకుండా అయ్యింది కచ్చితంగా గ్రామపంచాయతీ భవనాన్ని అత్యున్నత ఆధునిక హక్కులతో ఎమ్మెల్యే సహకారంతో పూర్తి చేస్తానని అన్నారు.గత పాలకులు భిక్కరు వెంట ఉన్న రైతులను ఇబ్బందులకు గురిచేసి, నాయకులు లబ్ధి పొందారు తప్ప గ్రామ ప్రజలకు ఒరిగిందేమీ లేదు.అలాంటి ఇసుక దోపిడిని మా ఎమ్మెల్యే ఎట్లాగైతే పోనీయకుండా కృషి చేస్తున్నారో దానికి నేను అండదండగా ఉండి బిక్కెర నుంచి ఇసుకపోకుండా  చూస్తానని ఈ సందర్భంగా ఆయన అన్నారు. మా గ్రామంలో సుమారు 40 ట్రాక్టర్ల పైన ఉన్నాయి ఏ ఒక్క టాక్టర్ పై ఇసుక తరలించిన ఊరుకునేది లేదని గ్రామంలోని ఇసుక సొంత అవసరాలకు తప్ప బయటకు రవాణా చేస్తే ఊరుకునేది లేదని సర్పంచ్ చిత్తలూరి సోమనారాయణ అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333