వ్యవస్థలు కుప్పకూలినాయి అంటే ఆ ప్రభుత్వం ఎంత దివాలా తీసిందో అర్థం చేసుకోవచ్చు

Jun 7, 2024 - 16:03
Jun 8, 2024 - 18:58
 0  9
వ్యవస్థలు కుప్పకూలినాయి అంటే ఆ ప్రభుత్వం ఎంత దివాలా తీసిందో అర్థం చేసుకోవచ్చు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వo ప్రజా వ్యతిరేక విధానాలకు  

పరాకాష్ట.నిర్బంధం, అణచివేత ,దాడులు  ప్రజాస్వామ్యంలో  

ఓటమికి ఆనవాళ్లు.

2023 నవంబర్లో తెలంగాణలో , మే2024 ఆంధ్రప్రదేశ్లో

 ప్రభుత్వాల ఓటమికి  అవే కారణాలు.

---  వడ్డేపల్లి మల్లేశము

అధికారంలో కొనసాగిన పాలకపక్షాలు  ఎన్నికల్లో ఘోర పరాజయం  చవిచూడడం అంటే  తమ పాలనలోని లోపాలు ప్రజా వ్యతిరేక విధానాలు  అమలు చేసిన నిర్బంధము అణచివేత వంటి అప్రజా స్వామికి లక్షణాలు ప్రధాన కారణం అని  ఇటీవలి ఎన్నికల ఫలితాలు స్పష్టంగా గమనించవచ్చు.  2023 నవంబర్లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో  అధికారంలో కొనసాగిన టిఆర్ఎస్ పాలన  పట్ల విసుగు చెందిన ప్రజలు మేధావులు  ఉమ్మడి పోరాటం ద్వారా ఓడించిన సంగతి తెలుసు.  ప్రజాస్వామ్యం ఎంత ఖూనీ అయ్యిందో ప్రజా వ్యతిరేక విధానాలతో  తెలంగాణ అస్తిత్వమే దెబ్బతిన్న సంగతి మన అందరికీ తెలుసు. అంతే కాదు ఆర్థిక అరాచకత్వంతో అప్పుల పాలైన రాష్ట్రాన్ని  పాలించడమే కాదు వ్యవస్థలన్నీ కుప్పకూలిన విషయాన్ని గమనిస్తే కొత్త ప్రభుత్వానికి కొండంత సవాల్ . 2024 మే నెలలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో  అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ  ఘోర పరాజయాన్ని చవిచూచి 175 సీట్లకు గాను కేవలం 11 సీట్లతో సరిపెట్టుకోవడం అంటే సిగ్గుచేటు మాత్రమే కాదు  

 అధికార పార్టీకి చెందినటువంటి సభ్యుల పైన జరిపిన దాడులు,  జర్నలిస్టులు మేధావులు ప్రజలు ప్రజాస్వామికవాదులు ఇతర రాజకీయ పార్టీల మీద చేసిన ఆగడాలు, దౌర్జన్యాలు ప్రధాన కారణమని చెప్పక తప్పదు  .175 కు 175 సీట్లు తప్పకుండా వస్తాయని  ప్రగల్భాలు పలికితే 11 సీట్లతో సరిపెట్టుకోవడం అంటే  కోటానుకోట్ల రూపాయలను బటన్ నొక్కి ప్రజల అకౌంట్లో జమ చేసినప్పటికీ ఎందుకు మళ్ళీ తిరిగి పార్టీ గెలవలేదు అని ప్రశ్నించుకోవడం అవసరం.  ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో  ఒక్క సీటు కూడా సాధించని టిఆర్ఎస్ కూడా తమ పార్టీని ప్రక్షాళన చేసుకుంటామని, తప్పులను సవరించుకుంటామని ప్రకటన చేయడం  బాగానే ఉంది

. కానీ ఆ స్థాయిలో ఆచరణ లేకపోవడం ప్రభుత్వాన్ని పదేపదే నిందించడం వంటి కారణాలవల్ల ప్రజల చేతిలో పరాభవం తప్పదు అని ఇకనైనా తెలుసుకుంటే మంచిది.  గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకునిగా ఉన్న చంద్రబాబు నాయుడు ను  అరెస్టు చేయడం,  విచారణ ఖైదీ గాని  గుర్తించడం తప్ప ఆనవాళ్లు ఆధారాలు వెతకపోవడం  కోర్టు అనేకసార్లు ప్రభుత్వాన్ని మందలించిన సందర్భాలను కూడా గమనించవచ్చు.  అంతేకాదు తన పార్టీకి సంబంధించిన వాళ్లపైన పోలీసు దాడులు చేయించిన సందర్భాలు కూడా గమనార్హం  .ప్రశ్నించిన విలేకరులు ప్రజలు స్వపక్షం వాళ్ళు, ప్రతిపక్షం వాళ్ళు ఎవరైనా  దాడులకు బలైన సందర్భాలు అనేకం. ఆ  కారణంగానే ప్రభుత్వం కుప్పకూలిందని ఇప్పటికైనా జగన్మోహన్రెడ్డి గుర్తించడం అవసరం  ఇది కేవలం వైసీపీకీ, జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సంబంధించిన విషయం కాదు.  తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం  ఓటమి పాలు కావడానికి ఇతర రాష్ట్రాలలో  అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోవడానికి కూడా ఇలాంటి ఆన వాళ్లు అనేకం  ఉంటాయి అని గుర్తించాలి .

వ్యవస్థలను నిర్వీర్యం చేయడం, ఇష్టం ఉన్నట్టుగా అప్పులు చేయడం, ఆర్థిక అరాచకత్వానికి పాల్పడడం , సంక్షేమం పేరిట చేసిన ఖర్చుకు  అభివృద్ధికి పొంతన లేకపోవడం,  కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్ళించడం,  ఎన్నికలు  దాడులు అరాచకతము  ప్రతిపక్షాలను కొల్లగొట్టడం పైన ఉన్న ధ్యాస  ప్రజల ఆకాంక్షలను అమలు చేయడం పైన లేకపోవడం  ప్రభుత్వాల ఓటమికి ప్రధాన కారణాలుగా గుర్తించాలి.

 తాత్కాలిక ప్రలోభాలు :-

కొంతవరకు ఆంధ్రప్రదేశ్లో విద్యారంగం పైన ప్రభుత్వం దృష్టి సారించి సమీక్షలు నిర్వహించడంతో పాటు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి  పిల్లల తల్లిదండ్రుల అకౌంట్లో నగదును జమ చేసినప్పటికీ  అభివృద్ధి పైన దృష్టి సారించకపోవడం వంటి ప్రధాన కారణాలు   మనం  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానములో గమనించవచ్చు.  ఇక ప్రతిపక్ష నాయకులను  ఇతర రాజకీయ పార్టీల నాయకులను అవమానించడం,  

 వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోవడం,  తమ గెలుపును ఆపే శక్తి ఎవరికీ లేదని అహంభావం  ప్రదర్శించడం  వంటి ఆదిపత్య ధోరణి  కూడా  పాలకులకు మంచిది కాదు.  పరిపాలన గాడి తప్పిన సందర్భాలు అనేకం ఆర్థిక పరిస్థితులు  దుర్భరస్థాయిలో కొట్టుమిట్టాడుతుంటే వేతనాలు ఇవ్వలేని పరిస్థితి  కేంద్రం వద్ద గాని రిజర్వ్ బ్యాంకులో గాని తెచ్చుకోలేని దుస్థితి అనేక సందర్భాలలో ఎదుర్కొన్న విషయం మనందరికీ తెలుసు.  ప్రణాళిక లేకుండా ఖర్చు చేయడమే  ప్రజలను ఆకర్షించడమే  పరిపాలన కాదు అని ఇప్పటికైనా తెలుసుకోవడం అవసరం . సంపద సృష్టించకుండా  ఉన్న డబ్బులను పంపిణీ చేస్తే  ప్రజా సంపద కొల్లగొట్టబడినట్లే కానీ సమాన పంపిణీ అనబడదు . ఇక వైద్యం,  పారిశ్రామిక విధానాలు,  ఇసుక , ఖనిజాలు  మాఫియా చేతిలో కూరుకుపోయి  ఆగడాలకు అంతులేకుండా పోయి ఎంతోమంది బలైన సందర్భాలను గమనించవచ్చు.

  ప్రతిపక్షాలకు చెందినటువంటి కార్యకర్తలు ఎందరో మృత్యు బారిన పడ్డారు  జర్నలిస్టుల పైన జరిగిన దాడులకు అంతే లేదు.  ప్రజలను ప్రతిపక్షాలను  ప్రజాస్వామ్య వాదులను ఎవరిని గౌరవించకుండా  నిరంకుషత్వంగా వ్యవహరిస్తే  ఉనికి ప్రశ్నార్థకం కాక మరేమవుతుంది? అదే కదా ప్రస్తుతం  ఆంధ్రప్రదేశ్లో వైసిపి  ఎదురైన గడ్డు పరిస్థితి.  తమను తాము సంస్కరించుకోవడం, తప్పొప్పులను సవరించుకోవడం,  ప్రజాస్వామిక దృక్పథంతో పనిచేయకపోతే రాజకీయాలకు దూరం కావడమే మంచిది. అందుకే బహుశా తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల్లో ఒక సీటు కూడా సాధించని  బి ఆర్ ఎస్ పార్టీని  కాంగ్రెస్ మిగతా రాజకీయ పార్టీలు ఆత్మబలిదానం చేసినట్లుగా భావిస్తూ  విమర్శిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు.  

 ఇక A P లో  ఊద్యోగులకు  ఇతర సిబ్బందికి రైతులకు  ఉపాధ్యాయులకు  ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా అనేక  డిమాండ్లు పెండింగ్లో ఉన్న విషయాన్ని కూడా  ఉద్యోగులు చాలా సీరియస్ గా తీసుకోవడం,  పెన్షనర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని తీర్మానించుకోవడం  మనం గమనించవచ్చు. కాబట్టి వ్యవస్థలు కుప్పకూలిన నేపథ్యంలో రాబోయే తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి  సవాల్ అయినప్పటికీ  ప్రజా సంఘాలు పౌర సంఘాలు ప్రజల ఆమోదంతో పరిపాలన చేయకపోతే ఏ ప్రభుత్వానికైనా ప్రజల చేతిలో ఇలాంటి పరాభవం తప్పదు. కనుక ప్రజాస్వామ్య బద్దంగా పాలించడానికి  కృషి చేసిన నాడు మాత్రమే పాలకులకు ప్రజల గుర్తింపు ఉంటుంది లేకుంటే  తుడిచిపెట్టుకుపోవడమే తరువాయి.

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333