ప్రజలకు ద్రోహం చేసిన ప్రభుత్వాన్ని  ప్రజలు అంశాల వారిగా నిలదీయాలి.

Jun 7, 2024 - 15:40
Jun 8, 2024 - 18:59
 0  9
ప్రజలకు ద్రోహం చేసిన ప్రభుత్వాన్ని  ప్రజలు అంశాల వారిగా నిలదీయాలి.

అందుకు  పాలకుల నిర్బంధం, అణచివేత,నియంతృత్వం

మీద అవగాహన ఉండాలి. 

ప్రజల ఆగ్రహానికి గురైన టిఆర్ఎస్  విద్రోహ చరిత్ర

ప్రజలకు తెలియకపోతే ఎలా 

----వడ్డేపల్లి మల్లేశం 

పాలకులు ఎవరైనా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలించకపోతే నిలదీసి, ప్రశ్నించి, ప్రతిఘటించి,  ఓడించే హక్కు ప్రజలకు ఉంటుంది ఇది చరిత్ర చాటిన  సత్యం .  ప్రజా పోరాటాలు దశాబ్దాల  ఉద్యమ నేపథ్యంలో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని  బంగారు తెలంగాణ చేస్తామని భరోసా ఇచ్చి,  తెలంగాణ సెంటిమెంట్తో ప్రజలను ప్రశ్నించకుండా అడ్డుకొని,  పది సంవత్సరాలు పరిపాలించిన టిఆర్ఎస్ ప్రభుత్వం  ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పాలించిన కారణంగా  ఓటమి పాలు కాక తప్పలేదు  నవంబర్ 2023 లో జరిగిన ఎన్నికల్లో . ఈ సందర్భంగా  ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు, అందరూ కూడా  టిఆర్ఎస్ పైన  అసంతృప్తి ఆగ్రహం  తో ఉన్న మాట వాస్తవం.  ప్రజలు జరిన తప్పుల ను  అవగాహన చేసుకుని  ప్రశ్నించడానికి సిద్ధంగా ఉంటే  ఏ పాలకులు తప్పులు చేసిన నిలదీయడానికి ఆస్కారం ఉంటుంది.  ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ ప్రభుత్వం  విస్మరించిన హామీలు,  తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలు,  మాట తప్పిన సందర్భాలు  ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన అవసరం ఉంది.

  విస్మరించిన హామీలు:-

  •  దళితులను ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చి  సమాధానము దాటవేసింది నిజం కాదా ?
    - దళితులకు మూడెకరాల భూమిని  పంపిణీ చేస్తామని  పంచడానికి భూమి ఎక్కడిది అని  ప్రశ్నించడంలో అర్థం ఏంటి ?
    -- గుట్టలు ప్రకృతి విధ్వంసం  ఆపాలని  సినీ టీవీ సంస్కృతిని  సంస్కరించాలని  ఉద్యమ కాలంలో  నినదించి హామీ ఇచ్చి ఆ తర్వాత ఊసు ఎత్తలేదు ఎందుకు ?
    -- అఖిలపక్షాలతో సమావేశం ఏర్పాటు చేస్తానని ఏనాడు కూడా ఆ రివాజును పాటించలేదు నిజం కాదా?
    --  ఉచిత ఎరువులు పంట బోనస్  ఇస్తామని మాట ఇచ్చి  నెరవేర్చలేనిది నిజం కాదా?
    ---  ఎస్సీ ఎస్టీ బీసీ సబ్ ప్లాను  అమలు చేస్తామని  మాట మార్చింది  అవునా కాదా?
    - డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం పిట్టకథలు చెప్పి  నా మ మాత్రం నిర్మించి  అనర్హులకు  ఇచ్చిన సంగతి ఏమిటి?
    --  ప్రతి ప్రసంగంలో  కుర్చేసుకుని కూర్చొని ప్రాజెక్టు నిర్మిస్తా అని  ఎక్కడ కూడా  ఉండి పనిచేసింది లేదు. 
    --ప్రపంచం నివ్వెర పోయే స్థాయిలో పరిపాలన చేస్తానని మాట ఇచ్చి  రాష్ట్రo ఏడు లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది   ఎవరివల్ల 
  • అమలు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలు :-

    -నిర్బంధం అణచివేత కొనసాగించి  హాలు మీటింగులకు కూడా అనుమతించక  ఎక్కడికక్కడ అరెస్టు చేసి  మేధావుల పైన ఉపా చట్టం పెట్టింది  నిజమే కదా  !
    --నిరసన కోసం  గతంలో ఏర్పాటు చేసిన   ఇందిరా పార్కులోని ధర్నా చౌక్ ను  ఎత్తేసి  ప్రజాస్వామ్యాన్ని  కూని చేయలేదా?
    --  ఖమ్మం, సిరిసిల్ల, హుస్నాబాద్లలో  ధాన్యానికి గిట్టుబాటు ధర  తక్షణ కొనుగోలు   ముంపు బాధితులు పరిహారం కోసం డిమాండ్ చేస్తే రైతులకు  బేడీలు వేసింది  మీ ప్రభుత్వమే కదా !
    -ప్రతిపక్షాలు ప్రజా సంఘాలకు స్వేచ్ఛ లేకుండా  నిర్బంధించడం  జేఏసీ చైర్మన్ కోదండరాం ఇంటిని  ముట్టడించి  ధ్వంసం    చేయడం  ఏ విలువల కోసం?
    --  ముఖ్యమంత్రి నివాసానికి మంత్రులు శాసనసభ్యులు  ప్రజలకు  అవకాశం లేకుండా అడ్డుకున్న తీరు  మీ నిరంకుశత్వం కాదా?  ఇనుప కంచే వేసి  రాష్ట్రంలో అప్రజా స్వామ్యాన్ని  కొనసాగించినది ఎవరికీ తెలియదు?
    --  ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా  పోరాడినట్లు నటించి  కాంట్రాక్టులు ఒప్పందాలన్నీ  ఆ ప్రాంతం వాళ్లతో  చేసుకోవడం అంటే  ద్వంద్వనీతికి  అద్దం పడుతుంది.
    -  రైతుబంధు పేరుతో భూస్వాములు సంపన్న వర్గాలకు  వందల ఎకరాలకు అందులో పంటలు పండని భూములు గుట్టలకు  కోట్ల ప్రజాధనాన్ని అప్పనంగా కట్టబెట్టి  పేదలకు ద్రోహం చేసింది నిజం కాదా?
    --  అధికార యంత్రాంగంలోనూ  పాలనలోనూ  తమ సామాజిక వర్గం వారికి ఎక్కువ అవకాశం కల్పించడం  మెజారిటీ బీసీ వర్గాలకు  మొండి చేయి చూపింది  నిజమేనా ?
    -- ఫోన్ టాపింగ్,  గొర్రెల పంపిణీ , ప్రాజెక్టులు, కాలువలు, చెక్ డ్యాములు  ,దేవాలయాలు, సచివాలయము,  చివరికి కాలేశ్వరం ప్రాజెక్టు  అన్నింటా అవినీతి పేరుకు పోయి  విచారణ కొనసాగుతున్నది.  అన్నింటికి బాధ్యులైన ఆనాటి పాలకులను  అరెస్టు చేసి నష్టపరిహారం  వసూలు చేయాలి .
         ఉమ్మడి రాష్ట్రంలో కంటే అత్యల్పం 6శాతం విద్యకు నిధులను కేటాయించి   విద్య పైన ఏనాడూ సమీక్ష జరపక  విద్యా వైద్య రంగాలను ప్రైవేటుకు అప్పగించి గాలికి వదిలి  పబ్లిక్ సర్వీస్ కమిషన్  అవినీతిలో కూరుకుపోయి  అనేక పరీక్షలు పేపర్ లీకేజీ కారణంగా యువత నష్టపోయింది మీ పరిపాలన కాలంలో కాదా?  30 లక్షల యువతకు ద్రోహం చేసిన మీ పాలన  ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం చాలా ఉంది.  పేదరికం నిరుద్యోగం  తగ్గలేదు. ఆకలి చావులు ఆత్మహత్యలు  భారీగా కొనసాగినాయి.
  •  అనుత్పాదక రంగం మీద ఎక్కువ ఖర్చు చేసి  అనేక ప్రభుత్వ విభాగాలకు కోట్లాది రూపాయలు బకాయి  ఉన్నది వాస్తవం . విద్యుత్ సంస్థలకు ప్రభుత్వ కార్యాలయాలకు  ప్రైవేటు కళాశాలకు ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో  కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి  ఉత్తమ పరిపాలన అందించిన మంటే ఎలా  ?ఎవరి పరిపాలనలో చేసిన అప్పులకు ఆ ప్రభుత్వమే బాధ్యత వహించే పరిస్థితి రావాలి  అందుకు పార్లమెంట్లో తగిన చట్టం చేయాలి ప్రజలు కూడా ఆ వైపుగా డిమాండ్ చేసినప్పుడే పాలకుల యొక్క వృధా  ఖర్చు ఆడంబరాలు అధికార   దుర్వినియోగం తగ్గుతుంది . గత నాలుగు సంవత్సరాలలో కేవలం కళాశాలల ఫీజు రియంబర్స్మెంట్  ఉపకార వేతనాలకు  ప్రభుత్వం చెల్లించవలసిన బకాయి 6000 కోట్లు ఉన్నదంటే  ఇక ప్రభుత్వం ఏం చేసిందో అర్థం చేసుకోవచ్చు.  ప్రకటనలు ఆడంబరాలు ప్రచారంతో  ఉద్దెర  ప్రభుత్వముగా కొనసాగిన తీరు  ఆక్షేపనియం భవిష్యత్తులో ఇలాంటి అవకాశం ఏ ప్రభుత్వానికి ఇవ్వడానికి వీలు లేదు.  ఇక యువజన, విద్య ,వైద్యం,  న్యాయం, పరిశ్రమలు  వంటి అంశాల పైన ఏ లాంటి విధాన రూపకల్పన జరగలేదు విశ్వవిద్యాలయ విద్య ధ్వంసం అయ్యింది.ప్రయివేటు వాటినిప్రోత్సహించి పెదవర్గాలకు ద్రోహంచేసింది.పత్రికలు,స్వేచ్ఛపై నిర్భందంతో అమానవేయపరిస్తిథులు కొనసాగినవి.
         ప్రస్తుతం కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వమైన ఇలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా అన్ని అంశాల పైన విధానపరమైన ప్రకటన చేసి విద్య వైద్య రంగాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా  ప్రజల కనీస అవసరాలను తీర్చగలిగే మానవాభివృద్ధిని సాధించడమే తన ప్రాధాన్యతగా తీసుకుంటే  కచ్చితంగా పేద వర్గాలు ఆలోచిస్తారు. ప్రభుత్వాన్ని  ఆదరిస్తారు గుర్తుంచుకుంటారు . ప్రజల సమస్యలను ఆలోచించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది  అది విస్మరించిన పాలకులకు  టీఆర్ఎస్ లాగా  ఓటమి తప్పదు .
    ( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు  అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట( చౌటపల్లి) తెలంగాణ రాష్ట్రం)
Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333