వెలుగువనజ్యోతి వివో కు ముగ్గుల పోటీలో మొదటి బహుమతి.

చుంచుపల్లి మండలం వెలుగువనజ్యోతి వివో కు మొదటి బహుమతి

Sep 30, 2024 - 19:10
 0  2
వెలుగువనజ్యోతి వివో కు ముగ్గుల పోటీలో మొదటి బహుమతి.
వెలుగువనజ్యోతి వివో కు ముగ్గుల పోటీలో మొదటి బహుమతి.
వెలుగువనజ్యోతి వివో కు ముగ్గుల పోటీలో మొదటి బహుమతి.

కొత్తగూడెం సెప్టెంబర్ 30 ( ) స్వచ్ భారత్ మిషన్ (గ్రామీణ్), స్వచ్ఛత హి సేవ 2024 సెప్టెంబర్. 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే కార్యక్రమాలలో భాగంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ,  ఆధ్వర్యంలో మహిళలకీ స్వచ్ఛత హి సేవ పై ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు (200) మదికి పైగా మహిళలు ఈ పోటీల్లో పాల్గొనటం జరిగినది.ఈ కార్యక్రమానికి స్వయం సహాయక సంఘ మహిళలు, మెప్మా మహిళలు. ఐసిడిఎస్ మహిళలు  ఐ డి ఓ సి లో ఉన్న మహిళా ఉద్యోగులందరూ పెద్ద ఎత్తున ఈ ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.ఈ ముగ్గుల పోటీ అనేది స్వచ్ఛతే సేవ, స్వచ్ఛదనం పచ్చదనం (అమ్మ పేరు మీద మొక్క), తడి చెత్త పొడి చెత్త వేరు చేయు విధానం, ఎరువు తయారీ విధానం, ప్లాస్టిక్ నిర్మూలన తిరస్కరించడం/తగ్గించడం/పునర్వినియోగం పైన, మరుగుదొడ్డి నిర్మాణం వాడకం పై అవగాహన  ఇంకుడు గుంతల నిర్మాణం ఉపయోగాలు మీద ముగ్గులు వేయడం జరిగినది. ఈ కార్యక్రమానానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం విచ్చేసి ముగ్గుల పోటీలలో బహుమతి పొందిన మొదటి, రెండవ, మూడవ స్థానాల గెలుపొందిన మహిళలకు, అయిదుగురు కన్సోలేషన్ విన్నర్స్ కి  పోటీలో పలోగ్న్న ప్రతి మహిళకి సుమారుగా 150 మంది కి బహుమతులు (జ్యూట్ బాగ్స్) ను ప్రధానం చేయడంజరిగింది. మొదటి స్థానంలో గెలుపొందిన వారు వెలుగు వనజ్యోతి వివో చుంచుపల్లి మండలం రెండవ స్థానంలో గెలుపొందిన వారు సుజాతనగర్ మండలం మూడవ స్థానంలో గెలుపొందిన వారు కొత్తగూడెం  ఇల్లందు మునిసిపాలిటీ ఈ కార్యక్రమంలో భాగంగా  జిల్లా కలెక్టర్  సిగ్నేచర్ క్యాంపెయిన్ సెల్ఫీ పాయింట్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ విద్యా చందర్ ఏపీఎంలు సీసీలు తదితర అధికారులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333