విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు

Dec 19, 2025 - 19:54
 0  32
విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు
విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు
విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు

 జోగులాంబ గద్వాల 19 డిసెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఇటిక్యాల  ప్రాథమిక క ఆరోగ్య కేంద్రం ఇటిక్యాల డాక్టర్ రాధిక ఎర్రవల్లి లోని TGSWRS(JC BOYS IEEJA) స్కూల్ కి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు జరిపారు ఇందులో 544 మంది విద్యార్థులకు గాను 134 మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు జరిపి చికిత్స చేయడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులకు అలర్జీ, దగ్గు, పడిశం, విరోచనాలు, కడుపు నొప్పి మొదలగు చిన్నచిన్న ఆరోగ్య రుగ్మతలకు చికిత్స చేయడం జరిగింది.మరియు విద్యార్థులకు హ్యాండ్ వాష్ గురించి, ఆరోగ్య విద్యను మరియు వ్యక్తిగత పరిశుభ్రత,  సీజనల్ వ్యాధుల గురించి మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా,, ఫైలేరియా మొదలగు దోమల నుంచి వచ్చే వ్యాధుల గురించి వివరించడం జరిగింది మరియు విద్యార్థులకు మెనూ ప్రకారం ప్రతిరోజు భోజన వసతి అందిస్తున్నామని వివరించారు మరియు డైనింగ్ హాల్, స్టోర్ రూమ్, కిచెన్ రూమ్ ని, పరిశీలించడం జరిగింది. మరియు నీటి వసతి కూడా R O tank ద్వారా విద్యార్థులకు డ్రింకింగ్ వాటర్ అందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ రామాంజనేయులు మరియు సూపర్వైజర్ బాల మురళి కృష్ణ టీచర్స్, ఇటిక్యాల ఆరోగ్య వైద్య సిబ్బంది డాక్టర్ రాధిక హెల్త్ సూపర్వైజర్ శేఖర్  , కొండే రు Anms,  నర్మదా, పరిమళ ,ఆశా కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333