అధికారుల సర్వేపై కలెక్టర్ స్పందించాలి.
సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.
(సూర్యాపేట టౌన్ సెప్టెంబర్ 30 ) సూర్యాపేట జిల్లా కేంద్రంలో హైడ్రా పేరుతో అధికారులు చేస్తున్న సర్వేపై జిల్లా కలెక్టర్ స్పందించి ఆందోళనలో ఉన్న ప్రజలకు భరోసానివ్వాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సావిత్రి భాయ్ పూలే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. హైడ్రా హైదరాబాద్ పరిధి వరకు మాత్రమే ఉంటుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేసినప్పటికీ, సూర్యాపేట జిల్లా కేంద్రంలో అధికారులు సర్వే చేయడం ప్రజలకు ఆందోళన కలిగిస్తుంది అన్నారు. రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సైతం హైడ్రా కూల్చివేతలు సూర్యాపేటలో ఉండవని ప్రకటించినప్పటికీ ప్రజల్లో భయాందోళనలు తగ్గలేదన్నారు. ఇప్పటికే సూర్యాపేటలో చెరువుల సుందరీ కరణ చేసిన నేపథ్యంలో కూల్చివేతలు ఉండవని రమేష్ రెడ్డి చెప్తున్నప్పటికీ ఓవైపు కొందరిలో ఉపశమనం ఉన్నప్పటికీ మరి కొంతమందిలో భయాందోళన ఉందన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సద్దలచెరువు సమీపంలో ఇటీవల జరిగిన అధికారుల సర్వే విషయంపై జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ స్పందించి కూల్చివేతల విషయమై స్పష్టత ఇస్తే ప్రజలు భయాందోళనల నుండి బయటపడే అవకాశం ఉందన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి ప్రకటన చేయాలని కోరారు. ఎంతోమంది నిరుపేదలు50 ఏళ్ల క్రితం నుండి మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకొని నివాసాలు ఏర్పాటు చేసుకొని ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తూ ఉన్నారని చెప్పారు. అధికారులు సర్వే పేరుతో మార్కింగ్ చేయడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది అన్నారు. ఇప్పటికే ఎంతోమంది నిరుపేదలు కూల్చివేతలు చేస్తే ఆత్మహత్య శరణ్యమని మానసిక వేదనలో బిక్కుబిక్కుమంటూ నిద్రాహారాలు మాని ఉంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు రియల్ ఎస్టేట్ పట్టణ ఉపాధ్యక్షుడు ఖమ్మంపాటి అంజయ్య గౌడ్ కార్యదర్శి సహాయ కార్యదర్శి సహాయ కార్యదర్శి ఆకుల మారయ్య గౌడ్ సూర్యాపేట పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి నీలయ్య తదితరులు పాల్గొన్నారు.