శిక్షల శాతం పెంచాలి:జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు.

కోర్టు డ్యూటీ అధికారుల వర్టికల్ మీటింగ్ లో జిల్లా ఎస్పీ.

Sep 30, 2024 - 19:13
 0  4
శిక్షల శాతం పెంచాలి:జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు.
శిక్షల శాతం పెంచాలి:జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు.

జోగులాంబ గద్వాల 30 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల జిల్లా లో ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు అయి చార్జిషీట్ అయిన కేసులలో శిక్షల శాతం పెంచేందుకు కోర్టు డ్యూటీ పోలీస్ అధికారులు కృషి చేయాలని జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు అధికారులను ఆదేశించారు.చార్జిషీట్ అయిన కేసులలో శిక్షల శాతం పెంచేందుకు తీసుకుంటున్న చర్యలలో బాగంగా ఈ రోజు జిల్లా ఎస్పీ కోర్టు డ్యూటీ అధికారులతో సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయం లో సమీక్షా సమావేశం నిర్వహించారు.అందులోని భాగంగా పోలీస్ స్టేషన్ ల వారిగా కోర్ట్ డ్యూటీ అధికారుల పనితీరును పరిశీలించారు.ఈ సదర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చార్జిషీట్ అయిన కేసులలో త్వరగా సీసీ నెంబర్ లు పొందాలని అన్నారు. గ్రేవ్ కేసులు అక్విట్ అయితే  అయితే అధికారులకు తెలిపి వెంటనే పైకోర్టుకు ఆపిల్ చేయాలని సూచించారు.  సెషన్స్ కోర్టు పరిధిలో ట్రయల్ నడిచే పోక్సో, రేప్, మర్డర్, తదితర కేసులను టార్గెట్గా పెట్టుకుని నేరస్తులకు శిక్షలు పడే విధంగా సాక్షులు మోటివేట్ చేయాలనీ సూచించారు.ప్రతి రోజూ క్రమం తప్పకుండా కోర్టుకు వెళ్లాలని, క్రిమినల్ జస్టిస్ సిస్టం సిసిటిఎన్ఎస్/కోర్టు మానిటరింగ్ సిస్టం లో కోర్టులో జరుగు ప్రాసెస్ సిసిడిలు  సమన్స్ వారెంట్స్, ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఎంట్రీ చేయాలని సూచించారు. చార్జిషీట్ అయిన కేసులలో  కన్వెక్షన్ రేటు పెంచాలని దీని ద్వారా ప్రజల్లో డిపార్ట్మెంట్ పై మంచి అభిప్రాయం కలుగుతుందని, మరియు క్రైమ్ రేట్ తగ్గుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి కన్వెక్షన్ రేటు పెంచాలని సూచించారు. సమస్స్, వారెంట్స్ పెండింగ్ లేకుండా చూడాలని తెలిపారు.శిక్షల శాతం పెంచేందుకు కోర్టు డ్యూటీ అధికారులు ప్రణాళిక ప్రకారం పని చేస్తూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు.ఈ కార్యక్రమం లో డిసిఆర్బి ఎస్సై రజిత, కోర్టు లైసన్  ఏ .ఎస్సై  ప్రసాద్, హెడ్ కానిస్టేబుల్స్ పరమేష్,సాయి బాబా, లక్ష్మణ్ కోర్టు డ్యూటీ అదికారులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333