విభళాపురం ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో మిత్రునికి ఆర్థిక సహాయం అందజేత
మోతె : 13 ఆగస్టు 2025 తెలంగాణ వార్త రిపోర్టర్ : -- సూర్యాపేట జిల్లా మోతె మండలం విభళాపురం గ్రామం నందు దామళ్ల అఖిల్ అమ్మ సుభద్ర క్యాన్సర్ వ్యాధితో గత ఐదు సంవత్సరాలుగా పోరాడి చనిపోవడం జరిగింది, వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా దీనాస్థితిలో ఉండడం, కుమారుడు అఖిల్ కారు డ్రైవింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు, హాస్పిటల్ ఖర్చులు, కుటుంబ పరిస్థితులు ఆర్థికంగా కుంగిపోయిన వారి కుటుంబానికి చేయూతనివ్వాలని విషయం తెలుసుకున్న ఫ్రెండ్స్ యూత్ సభ్యులందరూ ఏకమై వారికి 43000 (నలభై మూడువేల రూపాయల) ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.