మైనర్ బాలికను లైంగిక వేధింపులకు గురిచేసిన వ్యక్తికి ఆరు సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా.

Jun 9, 2026 - 23:39
 0  1

2021 సంవత్సరంలో అనంతగిరి పోలీస్ స్టేషన్ నందు నమోదైన పోక్సో కేసులో తీర్పు వెల్లడించిన జిల్లా కోర్టు.-

 నిందితుడు నేరానికి పాల్పడ్డాడని నిర్ధారించి ఆరు సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ ఉత్తర్వులు.

అనంతగిరి మండలానికి చెందిన మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని 2021 సంత్సరంలో బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపి అనంతగిరి పోలీస్ స్టేషన్ నందు పోక్సో నమోదు చేయడం జరిగింది. విచారణలో భాగంగా మండలానికి చెందిన లారిడ్రైవర్ మాడుగుల రత్నం రాజు అనే 44 సంవత్సరాల వ్యక్తి మైనర్ బాలికలను లైంగిక వేధింపులకు గురిచేసినాడని తేల్చి కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించి బలమైన సాక్షాలు, సాంకేతిక ఆధారాలతో అప్పటి దర్యాప్తు అధికారి నేరాభియోగ పత్రాలను కోర్టుకు దాతలు చేయడం జరిగింది. కేసు నమోదు, నేర అభియోగ పత్రాల ఆధారంగా సుమారు పదిమంది సాక్షులను బాధితులను విచారించిన సూర్యాపేట 1st ADJ, పోక్సో కోర్టు న్యాయమూర్తి గారు, నిందితుడు రత్నం రాజు నేరానికి పాల్పడినట్టు నిర్ధారించి ఆరు సంవత్సరాల జైలు శిక్ష 2000 రూపాయల జరిమానా విధించడం జరిగినది. బాధితుల తరఫున పిపి రఘురామయ్య వాదనలు వినిపించారు. కోర్టులైజన్ అధికారి శ్రీకాంత్, కోర్టు డ్యూటీ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు సకాలంలో కోర్టు అధికారులతో సమన్వయంగా పనిచేశారు. ఈ కేసును ఎప్పటికప్పుడు డిఎస్ప,  దర్యాప్తు అధికారులు పర్యవేక్షణ చేసి శిక్షలు అమలు అయ్యేలాగా కృషి చేయడం జరిగింది

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333