భువనగిరి సభ బడుగు, బలహీన వర్గాల భవిష్యత్ పోరాటాలకు దిశానిర్దేశం చేసింది

వట్టే జానయ్య యాదవ్

Jul 8, 2026 - 00:22
Jul 8, 2026 - 00:48
 0  4
భువనగిరి సభ బడుగు, బలహీన వర్గాల భవిష్యత్ పోరాటాలకు దిశానిర్దేశం చేసింది
భువనగిరి సభ బడుగు, బలహీన వర్గాల భవిష్యత్ పోరాటాలకు దిశానిర్దేశం చేసింది

హైదరాబాద్, 08 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:-  జూలై 7 భువనగిరిలో ఇటీవల నిర్వహించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ "రాజ్యాధికార సమరభేరి" సభ బడుగు, బలహీన వర్గాల సమాజానికి కొత్త దిశను చూపిందని, ఆ సభ ద్వారా పార్టీ భవిష్యత్ కార్యాచరణను స్పష్టంగా ప్రకటించిందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ అన్నారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దశాబ్దాల క్రితం ప్రజా చర్చ నుంచి దూరమైన భూ సమస్యను పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న మళ్లీ ప్రజల ముందుకు తీసుకువచ్చి రాజకీయ ఎజెండాగా మార్చారని పేర్కొన్నారు. భూములను ఆక్రమించి, వాటి ద్వారా సంపదను కూడబెట్టిన ఆధిపత్య వర్గాలు ఆర్థిక, రాజకీయ అధికారాన్ని తమ చేతుల్లో కేంద్రీకరించుకున్నాయని ఆయన విమర్శించారు.

భూమి అనేది కేవలం ఆస్తి మాత్రమే కాదని, సామాజిక ఆధిపత్యానికి మూలాధారమని పేర్కొన్న జానయ్య యాదవ్, అక్రమంగా కూడబెట్టిన భూములను గుర్తించి భూమిలేని పేదలకు పంపిణీ చేయాలనే లక్ష్యంతోనే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు సాగుతోందని చెప్పారు. ఈ అంశాన్నే భువనగిరి సభ ప్రజల ముందు స్పష్టంగా ఉంచిందన్నారు. భువనగిరి సభతో రాష్ట్రంలో కొనసాగుతున్న అగ్రవర్ణ ఆధిపత్య రాజకీయాలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైందని ఆయన వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, జనాభాకు తగిన రాజకీయ వాటా సాధించే దిశగా ప్రజలను చైతన్యపరచాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

యువత, కార్యకర్తలు గ్రామ గ్రామాన భువనగిరి సభ సందేశాన్ని తీసుకెళ్లి ప్రజల్లో విస్తృత చర్చకు దారితీయాలని, సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. తీన్మార్ మల్లన్న నాయకత్వంలో సామాజిక న్యాయం ఆధారంగా తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుందని, భువనగిరి సభ ఆ లక్ష్యానికి నాంది పలికిందని వట్టే జానయ్య యాదవ్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో, జిల్లా అధ్యక్షులు మామిడి అంజయ్య,జిల్లా మహిళా అధ్యక్షురాలు కొన్నెం మంజుల గౌడ్, పట్టణ అధ్యక్షులు కుంభం నాగరాజు, ఆత్మకూర్ మండల పార్టీ అధ్యక్షులు బొల్లె సైదులు,పెన్ పహాడ్ మండల పార్టీ అధ్యక్షులు ఆవుల అంజయ్య, వర్రె కవిత, యువజన నాయకులు కోలా కరుణాకర్, ఆరూరి రమేష్, భారీ భాయ్, బొమ్మగాని సైదులు, లింగాల సైదులు,వెంకటేష్, విజయ్, కోటేష్, తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333