రాష్ట్ర ప్రభుత్వం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సర్వర్ సమస్యను పరిష్కరించాలి
తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్
(సూర్యాపేట జిల్లా జున్ 30) తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో గత మూడు రోజులుగా నెలకొన్న సర్వర్ ప్రాబ్లం సమస్యను రాష్ట్ర ప్రభుత్వo ఉన్నతాధికారులు స్పందించి వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు,పంతంగి వీరస్వామి గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రం నుండి ఆయన విలేకరులతో మాట్లాడారు. నిత్యం రిజిస్ట్రేషన్ , కొరకు ప్రభుత్వ కార్యాలయాల్లో సర్వర్ ప్రాబ్లం ఉండటంవల్ల ప్రజలకు రిజిస్ట్రేషన్ లతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు జరగడం లేదన్నారు. గత మూడు రోజులుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సర్వర్ ప్రాబ్లం ఉండటం వల్ల ప్రజలు వందలాదిమంది నిరీక్షించాల్సి వచ్చిందని అన్నారు. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సిబ్బంది కొరత కూడా ఉన్నది తాగేందుకు మంచినీరు, కూర్చోవడానికి కుర్చీలు లేకపోవడంతో పాటు వర్షాకాలంలో వర్షం లోనే తడవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు .ప్రభుత్వం స్పందించి నూతన రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని మంజూరు చేసి నిర్మించడంతోపాటు మౌలిక వసతులు కల్పించాలని కోరారు. తెలంగాణ వ్యాప్తంగా గత మూడు రోజులుగా సర్వర్ ప్రాబ్లం చేత రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వేలాదిమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూరే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే సర్వర్ ప్రాబ్లం ఉండటం అధికారుల నిర్లక్ష్యానికి కారణమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వెంటనే అధికారులు స్పందించి సర్వర్ ప్రాబ్లం రాకుండా చర్యలు తీసుకోవడంతోపాటు అవసరమైతే సిబ్బందిని పెంచాలని విజ్ఞప్తి చేశారు.