తుమ్మిళ్ల లిఫ్ట్ కింద మల్లమ్మ కుంట రిజర్వాయర్ నిర్మాణం పనులకుగ్రీన్ సిగ్నల్
కాంగ్రెస్ పార్టీకిసాన్ జిల్లా ప్రెసిడెంట్ నాగరాజ్.
జోగులాంబ గద్వాల 7 జులై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : మాజీ ఎమ్మెల్యే డా.ఎస్. ఏ . సంపత్ కుమార్ * కృషి ఫలించిన, మల్లమ్మ కుంట రిజర్వాయర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన *సీ.ఎం. రేవంత్ రెడ్డి. అలంపూర్ నియోజకవర్గ ప్రజలు ఆశ...తుమ్మిళ్ళ లిఫ్ట్ క్రింద మల్లమ్మ కుంట రిజర్వాయర్ నిర్మాణం కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీ..ఎం.రేవంత్ రెడ్డి తానే స్వయంగా మన అలంపూర్ మాజీ ఎమ్మెల్యే , అలంపూర్ ఆర్డీఎస్ నీటికి,తుమ్మిళ్ళ లిఫ్ట్ సాధనకు , రిజర్వాయర్ల నిర్మాణం నకు కృషి చేసిన మన ప్రియతమ నాయకులు డా.ఎస్. ఏ.సంపత్ కుమార్ కి సీఎం స్వయంగా చరవాణిలో మల్లమ్మ కుంట నిర్మాణం కు ఫైలు అంత రెడీ అయ్యింది....పనులు చేసుకోవచ్చు...రైతులను ఒప్పించి, మెప్పించి భూసేకరణ కొరకు రైతులకు కావలసిన పరిహారాన్ని చెల్లించి త్వరగా పనులు మొదలు పెట్టండి అంటూ తెలిపారు...దానికి సంపత్ కుమార్ కళ్ళలో ఆనందభాష్పాలు రాలుపుతూ నా కోరిక నా ప్రజల కోరిక ఫలించిందనీ సీఎం కి ధన్యవాదాలు తెలియచేశారు.....
విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు ,కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి కి,అలంపూర్ ముద్దు బిడ్డ సంపత్ కుమార్ల చిత్రపటానికి పాలభీశేకం చేయడం జరిగింది..ఈ సందర్భములో మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ దొడ్డప్ప, వైస్ చైర్మన్ కుమార్ ,కిసాన్ సెల్ అధ్యక్షులు ఏనముల నాగరాజు,డిసిసి ఉపాధ్యక్షుడు,ఎల్ రెడ్డి,రాజోలి మండల అధ్యక్షుడు దస్తగిరి మాట్లాడుతూ.....రేవంత్ రెడ్డి కి,మా సంపత్ కుమార్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు.....కాంగ్రెస్ ప్రభుత్వం భూసేకరణ విషయములో రైతులను అన్ని విధాలుగా ఆదూకుంటుంది...రైతులకు తగిన సహాయం అందిస్తుంది...కానీ బిఆర్ఎస్ ప్రభుత్వంలో తుప్పు పట్టిన పైపులను వేసి ప్రజలను మోసగించి ఇచ్చిన హామీలను సైతం తుంగలో తొక్కి , అధికారంలో కి వచ్చి గెలిచి రిజర్వాయర్ల నిర్మాణం చేపడతామని హామీలు ఇచ్చి ప్రజల ఆశలపై నీళ్ళు చల్లి....ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే పనిలో భాగంగా మల్లమ్మ కుంట రిజర్వాయర్ నిర్మాణం కు సిగ్నలు ఫైలు అంత సిద్ధం చేస్తే...ఇప్పుడు బిఆర్ఎస్ నాయకులు మేమోదో చేశాం అంటూ...రేపు ఇక్కడ వచ్చి ఏదో చేయాలని చూస్తున్నారు....సిగ్గు సరం ఉంటే....మీరు ఏ మొహం పెట్టుకొని వస్తారు....ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం జరిగింది , మేము అధికారం లో ఉన్నపుడు చేయలేదు అని చెప్పుకోవడానికి ప్రజలకు క్షమాపణలు చెప్పుకోవడానికి వారు వస్తున్నారని వారు తెలిపారు..ఈ కార్యక్రమములో కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు...