కుసుమ హరినాథ్ బాబా దేవాలయం నిర్మాత కూడా రామదాసు గారే
తెలంగాణ వార్త జూలై 7 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం : రామాలయానికి దక్షిణ దిక్కులో ఉండి శివాలయానికి సమీపంలో ఉన్న గుట్టపై శ్రీ కుసుమహర్నాథ్ బాబా దేవాలయం నిర్మాణం చేసి సుమారు 100 ఏళ్లు కావస్తోంది. హరినాథ్ బాబా గారి భక్తుడైన పోలిశెట్టి.రామదాసు గారు ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయించారు. రిజిస్టార్ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్న రామదాసు గారు రిజిస్టార్ ఆఫీస్ కు పని మీద వచ్చిన వారినిబాబా గారికి భూదానం చేయమని కోరుతూ ఉండేవారు. ఈ కారణంగా సుమారు 150 ఎకరముల భూమి హరినాథ్ బాబా గారి పేరున రిజిస్టర్ అయ్యింది. దీనిలో సుమారు 47 ఎకరముల భూమి భద్రాచలం పట్టణంలో నేఉన్నది. భద్రాచలం వచ్చిన భక్తుల లో అధిక శాతం రామాలయానికి అతి సమీపంలో ఉన్న కుసుమ హరినాథ్ బాబా దేవాలయాన్ని కూడాదర్శించుకుంటారు. రామదాసు బాబా గారి భక్తుడు కావడం వల్ల అనేక వ్యయ ప్రయాసలతో తన కష్టార్జితంతో పాటు భక్తుల సహాయ సహకారాలతో గుట్టపైన బాబాగారి దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది. వందల కోట్ల రూపాయల వ్యయంతో భద్రాచలంరామాల యం పునరుద్ధరణ చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రామాలయంతో పాటు శ్రీ కుసుమ హరినాథ్ బాబా దేవాలయ పునరుద్ధరణకు ముందుకు రావడం ముఖ్యమంత్రి గారికి అభివందనలు తెలియజేస్తున్నట్లు బాబా గారి భక్తులు, శ్రీ కుసుమ హరినాథ్ బాబా ధర్మకర్తల మండలి పూర్వ అధ్యక్షులు రామా వజ్జల. రవికుమార్ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు. గుట్టపై చక్కనైన ప్రదేశంలో నిర్మించబడిన బాబా గారి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమ పనులు ఆదివారం ప్రారంభమైనవి. ఈ కార్యక్రమంలో రామాలయం ఈవో దామోదర్ రావు, హరినాథ్ బాబా దేవాలయ ఈవో శేషయ్య, భాజపా నేత నాగేంద్రబాబు, భక్త రామదాసు సేవా సమితి విజయ గోపాల్, ఆలయ నిర్మాత వారసులు పాల్గొన్నారు. బాబా గారి నూతన ఆలయం సర్వాంగ సుందరంగా భక్తులను ఆకర్షించే విధంగా ఆలయ పునర్నిర్మాణం జరిగే విధంగా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. ఆలయ నిర్మాత పోలిశెట్టి రామదాసు గారి వారసులను తగువిధంగా గౌరవించాలని భక్తులు కోరుతున్నారు.