జోగులాంబ గద్వాల జిల్లాలో బీసీలు లేరా?

బిజెపి రాష్ట్ర కార్యవర్గం  రామచంద్రారెడ్డి.

Jul 2, 2026 - 13:19
Jul 2, 2026 - 22:16
 0  3

జోగులాంబ గద్వాల 2 జూలై 2026 తెలంగాణవార్త ప్రతినిధి:-  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వెలుబడినటువంటి అంగన్వాడి నోటిఫికేషన్ లో జోగులాంబ గద్వాల జిల్లా లో మొత్తం 73 అంగన్వాడి సెంటర్లకు సంబంధించిన పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అందులో కనీసం ఒక్కటి అంటే ఒక్క పోస్టు కూడా బీసీలకు రిజర్వేషన్ చేయకపోవడం  శోచనీయం  ఈ భారత దేశంలో ఎక్కువ శాతం బీసీలే జిల్లాలో కూడా బీసీ బిడ్డలే అలాంటిది బీసీలకు ఒక్క స్థానం కూడా కేటాయించకపోవడం చాలా బాధాకరం 
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిసి కులగనన అని చెప్పి దేశంలోనే మేమే రోల్ మోడల్ అని డబ్బా కొట్టుకొని ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లాలో బీసీలకు ఒక్క అంగన్ వాడి టీచర్ కూడా కేటాయించకపోవడం చాలా శోచనీయం అంటే బీసీ బిడ్డలు కేవలం ఓటు బ్యాంకుకు మాత్రమేనా అని దుయ్య పట్టారు తప్పకుండా రాబోయే ఎన్నికల్లో తప్పకుండా బీసీలు బుద్ధి చెబుతారని అని వారు మండిపడ్డారు  ప్రభుత్వం  వెంటనే ఈ జోగులాంబ జిల్లాలో విడుదలైనటువంటి అంగన్వాడీ పోస్టులకు విడుదలైన నోటిఫికేషన్ పునర్ పరిశీలించి నోటిఫికేషన్ వెయ్యాలని వారుఅన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి అయిజ మండల అధ్యక్షులు గోపాలకృష్ణ బిజెపి సీనియర్ నాయకులు భగత్ రెడ్డి పట్టణ ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్ బిజెపి నాయకులు భీమన్న మహేష్ ప్రదీప్ స్వామి శివ మరియు తదితరులు ఉన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State