ఉపాధి కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య
ఉపాధి కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
చేస్తూ ఏప్రిల్ 20, 21 తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా ఎంపీడీవో కార్యాలయాల ముందు జరిగే ధర్నాలను జయప్రదం చేయండి.
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య
సూర్యాపేట,18 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– ఉపాధి కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 20,21 తేదీలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీడీవో కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహిస్తున్నామని ఈ ధర్నాకు ఉపాధి కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి. నాగయ్య పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పేరు మార్చి విబి జీవంజి పేరుతో కొత్త బిల్లును తీసుకొచ్చిందన్నారు. పాత పద్ధతిలో ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఉపాధి హామీకి నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఉపాధి హామీలో పనిచేస్తున్న కూలీలను రెండు పూటలు ఫోటో తీయాలని ఆలోచనను విరమించుకోవాలన్నారు.మార్చి నుండిఆగస్టు వరకు ఉపాధి కూలీలకు సమ్మర్ అలవెన్స్ వర్తింప చేయాలన్నారు. ఉపాధి కూలీలను ఆదుకునేందుకుప్రభుత్వం 200 రోజులు పని కల్పించి రోజు కూలి 600 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రప్రభుత్వంసవరించినవ్యవసాయ కార్మికుల వేతనాలను అమలుచేసి గ్రామ సభలు నిర్వహించి పెరిగిన కూలి రేట్లను గ్రామాలలో ప్రచారం చేయాలని కోరారు. 50 సంవత్సరాలు నిండినవ్యవసాయ కార్మికులకు 7500 రూపాయలు పింఛన్ ఇవ్వాలన్నారు. వేసవి కాలం సమీపిస్తున్నందున గ్రామాలలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పని ప్రదేశంలో కనీస సౌకర్యాలైన త్రాగునీరు, మెడికల్ కిట్టు, టెంటు, పారా, గడ్డపార వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు వ్యవసాయ కార్మికులకు ఇస్తామన్నా ఏడాదికి 12,000 రూపాయలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం సమగ్ర కేంద్ర శాసన చట్టం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, రాష్ట్ర కమిటీ సభ్యులు పులుసు సత్యం, జంపాల స్వరాజ్యం, పోసనబోయిన హుస్సేన్, జిల్లా నాయకులు సిరికొండ శ్రీనివాస్, సోమపంగా జానయ్య, మిట్టపల్లి లక్ష్మి, దోస పాటి బిక్షం, ఆరే రామకృష్ణారెడ్డి, బుడిగే ధనుంజయ గౌడ్, గాజు గళ్ళ ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.