బాధ్యతలు చేపట్టిన కొత్త సబ్ ఇన్‌స్పెక్టర్లు
రాజోలి, అయిజ, ఉండవల్లి పోలీస్ స్టేషన్లకు నూతన అధికారులు.
మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌ను కలిసిన ఎస్సైలు.
జోగులాంబ గద్వాల 7జూలై 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- నియోజకవర్గ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లకు కొత్తగా ముగ్గురు సబ్ ఇన్‌స్పెక్టర్లు నియమితులై మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. నియోజకవర్గంలోని కీలకమైన రాజోలి, అయిజ, ఉండవల్లి పోలీస్ స్టేషన్లకు నూతన అధికారులను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో భాగంగా రాజోలి పోలీస్ స్టేషన్ కొత్త ఎస్సైగా కిరణ్ కుమార్, అయిజ పోలీస్ స్టేషన్ ఎస్సైగా గురుస్వామి, ఉండవల్లి పోలీస్ స్టేషన్ ఎస్సైగా సురేష్ బాధ్యతలు చేపట్టారు.
తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. కాగా, కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఈ ముగ్గురు ఎస్సైలు మంగళవారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఎస్.ఏ. సంపత్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన నూతన అధికారులకు శుభాకాంక్షలు తెలుపుతూ శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలకు అందుబాటులో ఉంటూ నిష్పాక్షికంగా సేవలు అందించాలని సూచించారు.