సూర్యాపేట రూరల్ పరిధిలోని అంజనాపురి, మానస నగర్ కాలనీల్లో పోలీసుల 'కార్డన్ అండ్ సెర్చ్'

Jun 16, 2026 - 00:23
Jun 16, 2026 - 00:24
 0  1
సూర్యాపేట రూరల్ పరిధిలోని అంజనాపురి, మానస నగర్ కాలనీల్లో పోలీసుల 'కార్డన్ అండ్ సెర్చ్'
సూర్యాపేట రూరల్ పరిధిలోని అంజనాపురి, మానస నగర్ కాలనీల్లో పోలీసుల 'కార్డన్ అండ్ సెర్చ్'


- 26 ద్విచక్ర వాహనాలు ఆరు కారులు స్వాధీనం.
- ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీల వ్యక్తిగత వివరాలు ప్రస్తుత స్థితిగతులు పరిశీలన.
- కాలనీలోని ప్రతి నివాసం ప్రతి వ్యక్తి తనకి.
- అప్రమత్తత, అవగాహనతోనే నేరాలు నివారించవచ్చు.
- సీసీ కెమెరాలు ఏర్పాటుతో కాలానికి రక్షణ వలయం.
-... సూర్యాపేట డివిజన్ డిఎస్పి ప్రసన్నకుమార్..

సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ (IPS) గారి ఆదేశాల మేరకు, నేర నియంత్రణ మరియు ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించే లక్ష్యంతో సోమవారం తెల్లవారుజామున సూర్యాపేట రూరల్ పరిధిలోని అంజనాపురి మరియు మానస నగర్ కాలనీల్లో పోలీసులు మెరుపు దాడి (కార్డన్ అండ్ సెర్చ్) నిర్వహించారు.

ఈ తనిఖీల్లో సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్న కుమార్, రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్, ఎస్ఐ బాలు నాయక్ మరియు సుమారు 80 మందికి పైగా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కాలనీలోని ప్రతి నివాసాన్ని, ప్రతి వ్యక్తిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలైన రాజస్థాన్ మరియు మహారాష్ట్రల నుండి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్న కూలీల వివరాలను సేకరించి, వారి నేపథ్యాన్ని పరిశీలించారు.

*తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నవి:*
ఈ సోదాల సందర్భంగా సరైన ధృవీకరణ పత్రాలు లేని *26 ద్విచక్ర వాహనాలను* మరియు *6 కార్లను* పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

*ప్రజలకు డీఎస్పీ ప్రసన్న కుమార్ అవగాహన మరియు సూచనలు:*
ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. సమాజంలో ప్రజలకు మెరుగైన భద్రత కల్పించడం, పోలీసులపై నమ్మకాన్ని, ధైర్యాన్ని పెంపొందించడం ఈ కార్డన్ అండ్ సెర్చ్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ పలు కీలక సూచనలు చేశారు:

* *సైబర్ మోసాల నివారణ:* ప్రస్తుత కాలంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. తెలియని లింకులు క్లిక్ చేయడం, వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు పంచుకోవడం వంటివి చేయకూడదు.
* *డ్రగ్స్ నిర్మూలన:* యువతను పెడదోవ పట్టించే డ్రగ్స్ మరియు ఇతర మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
* *రోడ్డు భద్రత:* వాహనదారులు రోడ్డు ప్రయాణ సమయాల్లో ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ వల్ల కలిగే రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి.
* *నివాసాల అద్దె:* కొత్త వ్యక్తులకు ఇండ్లు అద్దెకు ఇచ్చేటప్పుడు వారి నేపథ్యాన్ని, గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలి. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వారు నేర చరిత్ర కలిగి ఉండే అవకాశం ఉన్నందున, యజమానులు అప్రమత్తంగా ఉండాలి.
* సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే కాలనీకి రక్షణ వలయంగా ఉంటాయని ప్రీతి ద్వారా నేరాలు నివారించవచ్చు అని నేరాలు జరిగినట్లయితే ఈ సంఘటనలు జరిగింది అట్లయితే వాటి ఆధారాలను సేకరించి తదితర ఛేదించవచ్చని ఉన్నారు. స్వీయ రక్షణ చర్యలలో భాగంగా ప్రజలు వ్యాపారులు సీసీ కెమెరాలు ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు.

ప్రజలు తమ పరిసరాల్లో ఏదైనా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సురక్షితమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డీఎస్పీ కోరారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333