అధికారుల నిర్లక్ష్యం పిల్లల భవిష్యత్తు ఆగం, గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి, జాతీయ సభ్యుడు, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం IHR

Jul 7, 2026 - 19:17
 0  1
అధికారుల నిర్లక్ష్యం పిల్లల భవిష్యత్తు ఆగం, గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి, జాతీయ సభ్యుడు, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం IHR

పిల్లల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతిలో ఉంటుందని వారు చూపించే దారినే మార్గదర్శకంగా పిల్లలు ఎంచుకుంటారని పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలంటే అది ఓన్లీ ఉపాధ్యాయులు వల్లే అవుతుందని కానీ ఇక్కడ అధికారులు నిర్లక్ష్యం వల్ల ఉపాధ్యాయులు మరియు పాఠశాలల హెడ్మాస్టర్లు నిర్లక్ష్యం వల్ల పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిసి తెలియని వయసులో వారు చేసే తెలిసి తెలియని పనులను అరికట్టకపోతే భవిష్యత్తులో వారే దేశానికి ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం జాతీయ సభ్యులు గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.

భద్రాచలం లో గల పాఠశాలల్లో ప్రభుత్వ మరియు ప్రైవేటు రెండు రంగాల్లో కూడా పిల్లల భద్రత వారి యొక్క ఆరోగ్యం యాజమాన్యానికి పట్టట్లేదు,
భద్రత ప్రామాణియాలు లేకుండా పలు ప్రైవేట్ స్కూలు మరియు ప్రభుత్వ పాఠశాలలు నడుపుతున్నారు. 
అన్ని ప్రైవేట్ స్కూళ్లు మరియు గవర్నమెంట్ స్కూల్లో సీసీ కెమెరాలు లేని వైనం, బ్రేక్ టైం లో కానీ లంచ్ బ్రేక్లో కానీ సాయంత్రం వెళ్లేటప్పుడు గానీ పిల్లలు కింద పడ్డ వారిలో వారు గొడవపడ్డ కొట్టుకున్న గాయపడ్డ ఎటువంటి సాక్ష్యం లేని వైనం ఏర్పడుతుంది. 
ఈ సంవత్సరం పాఠశాల మొదలై ఇప్పటికే ఒక నెల కావొస్తుంది అయినా కూడా సేఫ్టీ ప్రికాషన్స్ అండ్ మెజర్స్ లేని వైనం, లంచ్ బ్రేక్ లో పిల్లల్ని వదిలేసి ఎటువంటి రెస్పాన్సిబుల్ పర్సన్ ని పెట్టకుండా వదిలేస్తున్న వైనం కరపరుస్తున్నారు. 
అదే అదునుగా చూసుకొని పిల్లలు ఆటలు కొనసాగిస్తున్నారు ఆటల్లో ఈ నేటి తరం పిల్లలు ఆటలే కాకుండా కొట్లాటలు కూడా అలవాటు చేసుకుంటున్నారు ఆ కొట్లాటలు వల్ల పిల్లలకు తగిలే గాయాలకు బాధితులు ఎవరని పిల్లల తల్లితండ్రులు వాపోతున్నారు. సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల ఏం జరిగిందనేది కూడా ఎవరికీ తెలియకుండా ఉంటుంది పిల్లలకు తగిలే గాయాలను సర్దుకుపోతున్న తల్లిదండ్రులు రేపు ఏదైనా జరగడం జరిగి ప్రమాదం తీవ్రస్థాయిలో ఉంటే దానికి బాధ్యత ఎవరు వహించాలి అని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం జాతీయ సభ్యులు గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి ప్రశ్నించారు.
నిన్న తెలంగాణ రాష్ట్ర డిజిపి సివి ఆనంద్ గారు విలేకరులతో మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని తెలిపారు దానికి ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాలలు యాజమాన్యాలు కారణమవుతున్నాయి, పిల్లల పర్యవేక్షణ సరిగా లేకపోవడం వల్ల పిల్లలు తప్పుదారి పడే అవకాశం ఉందని, పిల్లలకు క్రీడా మైదానాలు లేని పాఠశాలలు ఉండడం వల్ల వారి యొక్క మానసిక వికాసం లోపించి వారిలో ఓన్లీ చదువు అనే మానసిక ఆవేదన గురైస్ కి గురవుతున్నారని, తద్వారా మార్కులు రాకపోయినా ఎవరు వారిని గుర్తించకపోయినా తీవ్ర ఒత్తిడికి లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సూచించారు. 
ఇప్పటివరకు భద్రాచలంలో ఉన్న ఎన్ని స్కూళ్లలో కౌన్సిలర్లని ఏర్పాటు చేశారని ఆయన ప్రశ్నించారు. 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్  మరియు ఐటీడీఏ పీవో  మరియు జిల్లా వైద్యాధికారి నిత్యం పర్యవేక్షణలో ఉండాలని అధికారుల నిర్లక్ష్యం వల్లే సమాజం పాడవుతుందని ఆయన తెలిపారు. 
నేటి పిల్లలే రేపటి పౌరులని దేశ భవిష్యత్తు వారిపై ఆధారపడి ఉందని వారితో మనం ఏ విధంగా నడుచుకుంటామో అదేవిధంగా వారు ప్రపంచంతో ఉంటారని ప్రతి ఒక్క పాఠశాలలో పిల్లలకు ఫిజికల్ గా మెంటల్ గా సోషల్ గా ఫిట్గా ఉండేలాగా కౌన్సిలర్లను ఏర్పాటు చేయాలని నిత్యం పిల్లల్ని పర్యవేక్షణలో ఉంచాలని సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, ఫీజుల ఒత్తిడిని పిల్లలపై రుద్దకూడదు అని పిల్లలతో దురుసుగా ప్రవర్తించిన టీచర్లను వెంటనే శిక్షించాలని అలాగే ప్రతి ప్రైవేట్ మరియు గవర్నమెంట్  పాఠశాలలో విద్యను బోధిస్తున్న ఉపాధ్యాయులు అందరికీ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ అని అలాగే పిల్లలు యూనిఫాంలో రావడం ఎట్లా అయితే తప్పనిసరి చేశారు టీచర్లు కూడా తప్పనిసరిగా అలాగే యూనిఫాంలో రావాలని, పిల్లలు రోజులో 8 గంటల పాటు వారి తల్లిదండ్రుల కన్నా టీచర్ల సమక్షంలోనే ఉంటారని ఇది వారిపై తీవ్ర ప్రభావం చూపుతోందని గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి తెలిపారు, 
తెలంగాణ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని అధికారంలో ఉన్న అధికార పార్టీ వాళ్లు తెలిపారు కావున వారిని కోరేది ఒక్కటే ఎవరి పరిధిలో వారి ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాలను నిత్యం సందర్శిస్తూ తనిఖీలు నిర్వహిస్తూ ఉండాలని అధికారులు నిద్ర వల్ల పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందని ఆయన తెలిపారు, 
పాఠశాలలు మొదలై ఇప్పటికి నెల రోజులు కావొస్తుంది ఇప్పటివరకు ఎన్ని స్కూళ్లను తనిఖీ చేసి ఎన్ని స్కూళ్లకు సేఫ్టీ ప్రికాషన్స్ మరియు భద్రత ప్రమాణాలు ఉన్నాయని జిల్లా విద్యాధికారి వెంటనే ఆ పత్రాలను జిల్లా కలెక్టర్ గారికి మరియు ఐటిడిఏ పిఓ గారికి సమర్పించాలని దీనిపై తక్షణ చర్య తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ని మరియు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ను గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి కోరారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333