అడ్డగూడూరు మండల బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడిగా వంశీ,ప్రధాన కార్యదర్శిగా చంటి ఎన్నిక

అడ్డగూడూరు 20 జూన్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ అన్న ఆదేశానుసారం మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యవేక్షకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండెల ధర్మేంద్ర మాకు ఇచ్చిన బాధ్యతలో భాగంగా తుంగతుర్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మందుల నాగరాజు ఆధ్వర్యంలో అడ్డగూడూర్ ఎం యన్ గార్డెన్స్ లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులు సూర్యాపేట జిల్లా పర్యవేక్షకులు రాష్ట్ర కార్యదర్శి దయాకరన్ మౌర్య అదేవిధంగా జిల్లా ఇన్చార్జ్ ఎర్ర రాంబాబు గార్ల ఆధ్వర్యంలో అడ్డగూడూరు మండల అధ్యక్షులుగా చెరుకుపల్లి వంశీ ను మరియు మండల ప్రధాన కార్యదర్శిగా మందుల చంటిని నియమించడం జరిగింది.అదేవిధంగా మోత్కూరు మండల అధ్యక్షుడు జిట్టా మహావీర్ మరియు నూతనకల్ మండల అధ్యక్షుడు కందుకూరి నరేందర్ మరియు మండల నాయకులు మందుల శేఖర్,మందుల శ్రీకాంత్,కార్తీక్, రాష్ట్ర కార్యదర్శి పార్టీ నాయకులకు అందరికీ పార్టీ యొక్క విధి విధానాలు,సిద్ధాంతం గురించి సామాజిక పరివర్తన ఉద్యమం ఎలా ముందుకు తీసుకెళ్లాలో దిశ నిర్దేశం చేసి పార్టీ పార్టీ నాయకులను పని విభజన చేయడం జరిగింది.