ఘనంగా ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Jul 7, 2026 - 21:55
 0  1
ఘనంగా ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తిరుమలగిరి 08 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

మాదిగ జాతి అస్తిత్వం ఆత్మగౌరవంతో పాటు అనేక కుల ఉద్యమాలకు పురుడు పోసిన ఉద్యమమే ఎమ్మార్పీఎస్.

నాటీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1994 జులై 7 తేదీన ప్రకాశం జిల్లా ఈదుమూడీ అనే గ్రామంలో 

ఏర్పడి నేటికి సరిగ్గా 32 సంవత్సరాలు.

రాజ్యాంగ పలాలు ప్రాథమిక హక్కులు 

షెడ్యూల్ కులాలకు కల్పించిన రిజర్వేషన్లు 

ఎస్సీ లో ఉన్న అన్ని ఉపకులాలకు సమాన 

పంపిణీ జనాభా నిష్పత్తి ప్రకారం సామాజిక న్యాయం జరగాలని ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలని చేసిన పోరాటం విజయం సాధించిన సందర్భంగా ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుమలగిరి మండల కేంద్రంలోని క్రాస్ రోడ్ లో ఎమ్మార్పీఎస్ తిరుమలగిరి మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా సీనియర్ నాయకులు కందుకూరి శ్రీను మాదిగ జెండా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంఎస్పి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు కందుకూరి సోమన్న మాదిగ మాట్లాడుతూ రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్లు జనాభా నిష్పత్తి ప్రకారం అందాలని సామాజిక న్యాయమైన ఎస్సీలకు కల్పించిన రిజర్వేషన్లను వర్గీకరించాలని గత 30 సంవత్సరాలుగా భారతదేశ చరిత్రలోనే ఈ తెలుగు నేల మీద అనేక బలమైన ప్రజా ఉద్యమాలు మిలిటెంట్ పోరాటాల నిర్వహించి

ప్రజలు ప్రజాస్వామిక వాదులు అందరి మద్దతుతో ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం జరిగిందని తెలిపారు ఉద్యమానికి సహకరించిన అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 

మరియు సమాజంలో అన్ని వర్గాలైన వృద్ధుల వితంతుల వికలాంగుల పెన్షన్ల కోసం మరియు గుండె జబ్బు చిన్నారుల కోసం చేసిన ఉద్యమ పోరాటమే ఆరోగ్యశ్రీ కార్డుగా మారిందని ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అత్యాచారక నిరోధక చట్టం తదితర అంశాలపై రాజీలేని పోరాటం చేసి సాధించింది కేవలం మందకృష్ణ మాదిగ నాయకత్వంలోనని తెలిపారు. ఇక భవిష్యత్తులో సమాజంలో అన్ని వర్గాల పేద ప్రజల సంక్షేమం కోసం జరిగే పోరాటంలో ప్రజలు ప్రజాస్థానిక వాదులు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు

 

ఈ కార్యక్రమంలో 

సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర కన్వీనర్.

 కొత్తగట్టు మల్లయ్య .జై భారత్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దుస్సా రామ్మూర్తి. మాదిగ ఉద్యోగుల సంఘం రిటైర్డ్ నాయకులు 

బోండ్ల అంజయ్యమాదిగ. ఎమ్మార్పీఎస్ తిరుమలగిరి మండల సీనియర్ నాయకులు ఏపూరి అవిలయ్యమాదిగ.

ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి కందుకూరి శ్రీనివాస్ మాదిగ. ఎమ్మార్పీఎస్ డప్పు కళాకారుల సంఘం మండల అధ్యక్షులు 

కందుకూరి రవి మాదిగ .ఎమ్మార్పీఎస్ తిరుమలగిరి టౌన్ మున్సిపాలిటీ నాయకులు బోడ సోమయ్య మాదిగ కందుకూరిమహేష్ మాదిగ జేరిపోతుల కొండయ్య మాదిగ. ఎమ్మార్పీఎస్ తిరుమలగిరి మండల నాయకులు ఎర్రబెల్లి వెంకన్న పల్లెర్ల సురేష్ మాదిగ మల్లెపాక అనిల్ నర్రమైసయ్య పల్లెర్ల గణేష్.బోడ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి