ప్రజల సమస్యల పరిష్కారానికొరకే ప్రజావాణి.

Jul 6, 2026 - 20:24
 0  1
ప్రజల సమస్యల పరిష్కారానికొరకే ప్రజావాణి.

భూ సమస్యలుఫిర్యాదులు ఆరు స్వీకరణ.

 ఇటిక్యాల తహసిల్దార్  శ్రీకాంత్ రెడ్డి.

 జోగులాంబ గద్వాల 6జూలై 2026 తెలంగాణవార్త ప్రతినిధి:-  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కార్యాలయాల చుట్టూ  తిరగకుండానే మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఇటిక్యాల తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రం రెవెన్యూ కార్యాలయం లో వివిధ శాఖల మండల స్థాయి అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమం సమావేశం ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా తహసిల్దార్  శ్రీకాంత్ రెడ్డి  మాట్లాడుతూ..... ప్రజలు జిల్లా కార్యాలయంలో చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మండల స్థాయిలోనే వారి వారి సమస్యలు కు పరిష్కారం దొరికేలా అధికారులు చర్యలు చేపట్టాలని వివిధ శాఖల అధికారులకు సూచించారు. పరిష్కారం కానీ సమస్యలను రాతపూర్వకంగా ఫిర్యాదుదారులకు అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

వివిధ శాఖల అధికారులు ప్రతి సోమవారం ఉదయం 10:30 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 1:00 వరకు మీ సమస్యల పరిష్కారాని కిఅధికారులు ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కావాలి. కానీ అధికారులు మాత్రం సమయపాలన పాటించడం లేదని ఫిర్యాదు దారుల నుంచి విమర్శలు వెలువెత్తుతున్నాయి.  అధికారులు మాత్రం వాళ్లకు సమయం దొరికినప్పుడు ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి వాళ్లు రిజిస్టర్లు సంతకాలు చేయడం ప్రజావాణి కార్యక్రమంలో జరుగుతున్నది అని ఫిర్యాదు దారుల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సమయపాలన పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు దారులు డిమాండ్ చేస్తున్నారు. వచ్చేవారం  ప్రజావాణి కార్యక్రమాన్ని కైనా సమయపాలన పాటిస్తారని అందరూ అధికారులు ప్రజావాణి కార్యక్రమానికి హాజరైతనే మండలంలోని వివిధ గ్రామాల సమస్యలు పరిష్కారం జరుగుతాయని ప్రజల నుంచి గుసగుసలు ఉన్నాయి.. మిగతా. వివిధ శాఖలకు సంబంధించిన మండల స్థాయి అధికారులు మాత్రం గైర్హాజర్ కావడం జరిగింది.  ఈ కార్యక్రమంలో ఇటిక్యాల తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి ఇటిక్యాల మండల వ్యవసాయ శాఖ అధికారి రవికుమార్ మాత్రమే ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333