విద్యుత్ తీగలు తాకి రెండు గేదెల మృతి

May 20, 2024 - 19:44
 0  9
విద్యుత్ తీగలు తాకి రెండు గేదెల మృతి

*పెన్ పహాడ్ మే 20

 తెలంగాణ వార్త :

 వేసవికాలంలో గాలులకు తెగిపడ్డ తీగలు మేత కోసం వచ్చిన రెండు గేదెలు విద్యుత్గు తెగిన తీగల తాకి కరెంటు పట్టి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని చిన్న సీతారాం తండా ఆవాసం పెద్ద సీతారాం తండ గ్రామ శివారులో సోమవారం చోటు చేసుకుంది స్థానికులు, బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం గ్రామానికి చెందిన బాణోత్ నాగు, బానోత్ సక్రాం వారికి ఉన్న గేదెలను వేసవికాలం కావడంతో మేత కోసం విడిచిపెట్టగా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల 11 కెవి వైర్ గ్రామ శివారులో తెగిపడి ఉండటంతో ఈ వైర్ తగిలి గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి సుమారు లక్షా 50 వేల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు విద్యుత్ అధికారులు తమకు నష్టపరిహారం అందించి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు...

Harikrishna Penpahad Mandal Reporter Suryapet Dist Telangana State