అలంపూర్ సబ్-డివిజన్, విద్యుత్ శాఖ వారి విజ్ఞప్తి.
జోగులాంబ గద్వాల 18 మే 2024 తెలంగాణవార్తా ప్రతినిధి:- నాణ్యమైన మరియు నిరంతరాయ విద్యుత్ సరఫరా కొనసాగింపు కొరకు తేదీ: 21.05.2024 మంగళవారం నాడు ఉదయం 07:00 గంటల నుంచి 10:00 గంటల వరకు 33KV శాంతినగర్-2 ఫీడరు పరిధిలో ప్రతి వర్షాకాలపు ఋతుపవనాలకు ముందస్తుగా చేపట్టే మరమ్మత్తు పనుల్లో భాగంగా ఒరిగిన విద్యుత్ స్థంబాలను సరిచేయు పనులు మరియు మిడిల్ పోల్స్ ఎత్తే పనులు అలాగే లైన్లను తాకే చెట్లకొమ్మలను తొలగించే పనులు చేయటం జరుగుతుంది.
అలాగే అదే సమయంలో ట్రాన్సుకో వారు మానోపాడ్ రైల్వే సబ్-స్టేషన్ కు కొత్త లైన్ల ఏర్పాటు పనులు11KV బొంకూర్ ఫీడరు పరిధిలో ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 02:00 గంటల వరకు చేయటం జరుగుతుంది.
కావున పైన తెల్పిన సమయానుగుణంగా 33/11KV మానోపాడ్, శ్రీనగర్ సబ్-స్టేషన్ల పరిధిలోని ఆయా గ్రామాలకు ఉదయం 07:00 నుంచి 10:00 గంటల వరకు మరియు బొంకూర్ గ్రామానికి ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 02:00 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలియజేస్తున్నాం. కావున విద్యుత్ వినియోగదారులు అందరూ సహకరించగలని
విద్యుత్ శాఖ,
అలంపూర్ సబ్-డివిజన్,
జోగులాంబ గద్వాల జిల్లా కోరుతున్నారు.