ఐఏఎల్ జిల్లా రెండవ మహాసభలను జయప్రదం చేయండి.....
నేడు జిల్లా కేంద్రంలో ఐఏఎల్ (IAL) రెండవ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని న్యాయవాదుల సంఘం నాయకులు బొమ్మగాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో కోర్ట్ ఆవరణలో కలిసి మాట్లాడానంతరం న్యాయవాదులకు నూతన చట్టాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడమైందని వారు తెలియజేశారు. న్యాయవాదులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై భవిష్యత్ కార్యాచరణ నిర్ణయాలు ఈ మహాసభలో తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ఈ మహాసభ ఖమ్మం రోడ్ JK రెసిడెన్సి నందు నిర్వహిస్తున్నామని ఈ మహాసభకు జిల్లా న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు తోగిటి మురళి, తాళ్లపల్లి సత్యనారాయణ, దొరపెల్లి రమేష్, దాక శ్రీనివాస నాయుడు, నరసింహారావు, గూడూరు శ్రీనివాస్, నారాయణ, లతీఫ్, గుగులోతు రాజారాం, ప్రతాప్, సైదులు తదితరులు పాల్గొన్నారు.