విద్యార్థుల కోసం స్టేజీల దగ్గర ఆర్టీసీ బస్సులను నిలుపుదల చేయాలి

Nov 24, 2025 - 19:06
 0  11

 బస్సులను ఆపకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్న విద్యార్థులు

ప్రజావాణిలో కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన

BRSV రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య

 జోగులాంబ గద్వాల 24 నవంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల నడిగడ్డలో రవాణా వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లనే విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారు

   ఈ సందర్బంగా బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ...  జోగులాంబ గద్వాల జిల్లాలో విద్యార్థులకు ప్రత్యేకమైన బస్సులను నడపాలని అన్నారు.  ఓకే నెలలో రెండుసార్లు ఐజ మున్సిపాలిటీలోని పర్ధిపురం దగ్గర విద్యార్థులే స్వచ్ఛందంగా రోడ్డుపైన బైఠాయించడం అంటే ఆర్టీసీ నిర్లక్ష్యం వల్లనే అని అన్నారు. గతంలో కూడా గోన్పాడు దగ్గర పాలిటెక్నిక్ విద్యార్థులు కూడా రోడ్డుపైన బయటాయించడం జరిగింది . జిల్లాలలో చాలా బస్సులు స్టేజీల దగ్గర విద్యార్థులను చూడగానే బస్సు డ్రైవర్లు కండక్టర్లు ఆపకుండా వెళ్ళిపోతున్నారు. గతంలో కూడా బస్సు డిపో మేనేజర్ కి వినతి ఇవ్వడం జరిగింది అయినా స్పందించలేదు. తక్షణమే బస్సు డిపో మేనేజర్ పైన చర్యలు తీసుకొని, ప్రతి స్టేజి దగ్గర విద్యార్థుల కోసం కచ్చితంగా బస్సు నిలుపుదల చేయాలని మరియు విద్యార్థుల కోసం ప్రత్యేకమైన బస్సులుడిమాండ్ చేశారు. నడిగడ్డలో రవాణా వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లనే విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారు సరైన సమయానికి పాఠశాలలకు కాలేజీలకు రాలేకపోతున్నారు ఈ కొరతను తీర్చాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి నాయకులు రమేష్, రఘు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333