వికలాంగులకి చేయూత'  పేరుతో ఆగస్ట్ 1 నుండి ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు

Jul 20, 2024 - 19:20
 0  46
వికలాంగులకి చేయూత'  పేరుతో ఆగస్ట్ 1 నుండి ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు

రాష్ట్ర చైర్మన్ ముత్తినేని వీరయ్య
హైదరాబాద్ 20 జూలై 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- తెలంగాణ రాష్ట్ర వికలాంగుల చైర్మన్ ముత్తినేని వీరయ్య శనివారం హైదరాబాద్ మలక్ పేటలోని వికలాంగుల సంక్షేమ, సహకార రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..పంచాయతీ రాజ్, మహిళా,శిశు సంక్షేమ,వికలాంగుల శాఖ మంత్రి దనసరి సీతక్క చేతుల మీదుగా వికలాంగులకు చేయూత గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నెలలో 1వ, 3వ గురువారాల్లో రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం మలక్ పేటలో గ్రీవెన్స్ నిర్వహణ చేయబడుతుందని, ప్రతి నెల 2వ, 4వ గురువారాల్లో డయల్ యువర్ చైర్మన్ పేరుతో గ్రీవెన్స్(100 శాతం వైకల్యం ఉన్న వ్యక్తుల కోసం) నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.గత 10 ఏండ్లలో నిర్లక్ష్యం చేయబడిన వికలాంగుల సమస్యలను తెలుసుకొని పరిష్కారం చేయడం కోసం ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని,ఈ కార్యక్రమంతో వికలాంగుల జీవితాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి,వారికి భరోసా కల్పించి వారీ జీవితాల్లో వెలుగులు నింపి వారికి అండగా ఉండి ముందుకు నడిపించడమే తెలంగాణ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు.  ఇది దేశంలోనే చారిత్రాత్మక ముందడుగుగా నిలుస్తుందని,గత బిఆర్ఎస్ ప్రభుత్వం వికలాంగుల సమస్యలపై నిర్లక్ష్యం వహించిందని దాన్ని ప్రక్షాళన చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు.అట్టడుగు వర్గాల అభివృద్ధి,నిస్సహాయుల అభివృద్దే నిజమైన ప్రజా పాలనని,  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన ప్రజా పాలనలో బాగంగా వికలాంగుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే పథకాలను రచించి అమలుపరుస్తామని అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333