ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలి....
. బీసీ విద్యార్థి సంఘం నాయకులు ప్రతిపాద రామకృష్ణ
మునగాల 20 జూలై 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు బకాయాలను వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా సంవత్సరాలు గడుస్తున్నా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం వలన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఉపకార వేతనాలు మంజూరు కావడం లేదని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదని అన్నారు పై చదువుల కొరకు సర్టిఫికెట్స్ అవసరం ఉన్నందున వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయాలను వెంటనే చెల్లించాలని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వమే ఫీజు రియంబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టినందున ఆ పథకానికి కట్టుబడి ఉండి వెంటనే బకాయిలు చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలన్నారు