అధికారులు లేని వ్యవసాయ కార్యాలయం
తెలంగాణ వార్త, నాగారం:- నాగారం మండల కేంద్రము లోని వ్యవసాయ కార్యాలయం లో ఒక్కరు కూడా అధికారులు లేకపోవడంతో బోసిపోయినట్టుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా తమ యొక్క రుణం మాఫీ అయిందా లేదా తెలుసుకోవడానికి రైతులు ఆఫీస్ దగ్గర అధికారుల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ అధికారులు ఎవరు ఆఫీసు లో లేకపోవడంతో ఆవేదనతో వెనుతిరిగి పోతున్నారు.