లో రాష్ట్ర స్థాయి 336 వ ర్యాంక్ సాధించిన ఆత్మకూర్ విద్యార్ది

Sep 21, 2025 - 21:00
 0  4
లో రాష్ట్ర స్థాయి 336 వ ర్యాంక్ సాధించిన ఆత్మకూర్ విద్యార్ది

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ నీట్ లో రాష్ట్ర స్థాయి 336 వ ర్యాంక్ సాధించిన ఆత్మకూర్ విద్యార్ది..* ఒకే గ్రామంలో రెండు మెడికల్ సీట్లు... ఆత్మకూర్ ఎస్ మండల కేంద్రానికి చెందిన కడపర్తి సిద్ధార్ద నీట్ పరీక్షల ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 336వ ర్యాంక్ సాధించాడు. ఆదివారం ప్రభుత్వం మెడికల్ బోర్డు ప్రకటించిన ఫలితాల్లో ఆల్ ఇండియా 23820 వ ర్యాంక్ సాధించాడు.ఆత్మకూర్ మండల కేంద్రం కు చెందిన కడపర్తి ప్రభాకర్ స్వప్న ల కుమారుడు సిద్ధార్ద హైదరాబాద్ లో నీ బోడుప్పల్ లో శ్రీ చైతన్య స్కూల్ లో 7వ తరగతి నుండి 10తరగతి వరకు చదివి, బాచుపల్లి శ్రీ చైతన్య కళాశాల లో ఇంటర్మీడియట్ చదివాడు .ఇటీవల జరిగిన నీట్ పరీక్ష రాసి 530 మార్కులు సాధించాడు.సిద్ధార్ద్ తండ్రి ప్రభాకర్ గత కొంత కాలంగా బోడుప్పల్ లో ప్రైవేట్ టీచర్ గా పనిచేస్తున్నారు. తల్లి స్వప్న బోడుప్పల్ గురుకుల పాఠశాల లో ప్రభుత్వ టీచర్ గా పనిచేస్తున్నారు. సిద్ధార్ద నీట్ లో ఉత్తమ ఫలితాలు సాధించడం తో పలువురు అభినందించారు. *నిరుపేదకుటుంబాన్ని వరించిన మెడికల్ సీట్.* నిరుపేద కుటుంబంలో పుట్టినా, యాతకుల శ్రీజ ఆత్మవిశ్వాసం మరియు కృషితో యాతాకుల శ్రీజ. మెడికల్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించనది.ఆత్మకూర్ మండల కేంద్రం కు చెందిన యాతాకుల వెంకన్న, తల్లి వెంకటమ్మ ఇద్దరూ వ్యవసాయ కార్మికులు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం లో పుట్టిన శ్రీజ విద్యపై ఉన్న ఆసక్తితో ప్రతి అవరోధాన్ని అధిగమించింది. శ్రీజ నీట్ లో 407మార్కులు సాధించి ఆల్ ఇండియా 19593 వ ర్యాంక్ సాధించినది. హైదరాబాద్ లో నీ ఎల్ బి నగర్ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు చదివిన శ్రీజ ఉత్తమ ఫలితాలు సాధించడం తో స్వచ్ఛంద సంస్థ వారు దిల్సుఖనగర్ శ్రీ చైతన్య కళాశాల లో చేర్పించి చదివించారు. వారి ఆశయాలను సాధించుట లో శ్రీజ మెడికల్ సీటు ను గెలుచుకుంది నిత్యం ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందుల మధ్యన చదువును కొనసాగించడమే ఆమెకు సవాలుగా మారింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న శ్రీజ, తక్కువ వనరులతోనే NEET వంటి కఠినమైన పరీక్షకు సన్నద్ధమై మెరిసింది. కొవ్వొత్తి వెలుగులో చదివిన రోజులు, పుస్తకాలు లేక స్నేహితులనుంచి తీసుకోవడం… ఇవన్నీ ఆమె విజయంలో భాగమయ్యాయి. స్థానికులు, గ్రామ పెద్దలు ఆమెను అభినందిస్తూ, మిగిలిన విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తున్నదని యువతి ని ప్రశంసిస్తున్నారు.