అర్థరాత్రి పోలీస్ సిబ్బంది విధులను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు
జోగులాంబ గద్వాల 12 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల్ పట్టణ నైట్ పెట్రోలింగ్ , బ్లూ కోల్ట్స్, గస్తీ విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు స్వయంగా వెళ్లి బుధవారం అర్ధ రాత్రి అకస్మిక తనిఖీలు చేశారు. అందులో భాగంగా గద్వాల్ పట్టణం లోని రాజీవ్ చౌక్, గాంధీ చౌక్, కృష్ణ వేణి చౌక్, బీరెళ్లి రోడ్డు, రైల్వే స్టేషన్, న్యూ హౌసింగ్ బోర్డు ప్రాంతాలలో తిరుగుతూ అక్కడి సిబ్బంది నిర్వహిస్తున్న గస్తీ, బ్లూ కోల్ట్స్ ,పెట్రోల్లింగ్, ఫుట్ పెట్రోలింగ్ విధులను అకస్మిక తనిఖి చేసి, వారు ఏ విధంగా విధులు నిర్వహిస్తున్నారు, రాత్రి సమయాలలో తిరిగే వారిని, వాహనాలను ఏలాంటి తనిఖీలు చేపడుతున్నారు, లాడ్జి లలో ఏలాంటి తనిఖీలు చేపడుతున్నారు,అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పాపిలాన్ డివైస్ ను ఉపయోగించి ప్రింగర్ ప్రింట్ తీసుకునే విధానాలను, పాయింట్ బుక్స్ విజిటింగ్ ను, ఫూట్ పెట్రోలింగ్ జరిగే తీరును పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడుతూ రాత్రి సమయాల్లో రోడ్ల పై గాని, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ పరిసరాలలో,కాలనీలలో తిరిగే వ్యక్తులను క్షుణ్నంగా పరిశీలించాలని, అనుమానాస్పదo గా కనిపిస్తే తప్పనిసరిగా పాపిలాన్ డివైస్ ద్వారా ఫింగర్ ప్రింట్స్ తీసుకొని యాప్ లో చెక్ చెయ్యాలని సూచించారు. అలాగే రాత్రి సమయంలో ఇసుక, మోరం అక్రమ రవాణా పై దృష్టి పెట్టాలని, అనుమతి లేని వాటిని నైట్ డ్యూటీ అధికారులకు అప్పగించాలని ఆదేశించారు. రైల్వే స్టేషన్ ను సందర్శించి గస్తీ, ఫూట్ పెట్రోలింగ్ సిబ్బందిని ఆకస్మిక తనిఖీ చేశారు. రాత్రి 11 గంటల నుండి 3 గంటల సమయాల్లో ఎన్ని ట్రైన్స్ వస్తాయి, ఎంత మంది ప్రయాణికులు దిగడం, ఎక్కడం జరుగుతుంది, ట్రాక్ వెంబడి గస్తీ విధులు ఎలా నిర్వహిస్తున్నారు వంటి వివరాలు పరిశీలించి ప్రాపర్టీ నేరాల పకడ్బందీ నియంత్రణకు తీసుకోవలసిన జాగ్రత్తల పై నైటీ డ్యూటీ ఇంచార్జి అధికారి ధరూర్ ఎస్సై షుకూర్ కు పలు సూచనలు చేశారు.అనంతరం గద్వాల్ టౌన్ పోలీస్ స్టేషన్ ను అకస్మిక తనిఖీ చేసి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోజు ఎన్ని గస్తీ, బ్లూ కోల్ట్స్,పెట్రోలింగ్ డ్యూటీలు నిర్వహించబడుతున్నాయి,ఎంత మంది డ్యూటిలలో అన్నారు, నైట్ వాచ్ డ్యూటీ అధికారులను తనిఖి చేసి ఎస్సై కళ్యాణ్ కుమార్ కు పలు సూచనలు చేశారు