రైతులకు ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోలు జరగాలి..  కలెక్టర్   సంతోష్

Nov 6, 2025 - 18:27
 0  4
రైతులకు ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోలు జరగాలి..  కలెక్టర్   సంతోష్

 జోగులాంబ గద్వాల 6 నవంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి:  గద్వాల రాష్ట్ర వ్యాప్తంగా మిల్లుల యజమానులు తలపెట్టిన సిసిఐ కొనుగోళ్ల  బంద్ ను ఉపసంహరించుకోవడం జరిగిందని, ఈ నెల 6వ తేది నుండి యధావిధిగా పత్తి కొనుగోలు ప్రక్రియ జరుగుతుందని రైతులకు  ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిన్నింగ్ మిల్లుల యజమానులు కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ తెలిపారు. అకాల వర్షాల వలన  ప్రస్తుత పత్తి కొనుగోలు సీజన్‌ కు సంబంధించిన ఏర్పాట్లు, రైతులకు సరైన ధర (MSP) చెల్లింపు, కొనుగోలు కేంద్రాల వద్ద సౌకర్యాల ఏర్పాటు, తూకం  చెల్లింపు ప్రక్రియల పారదర్శకంగా నిర్వహించాలని ఆన్నారు.
మద్దతు ధరలకు కొనుగోళ్లు జరిగేలా చూడాలని, రైతులకు అన్ని సదుపాయాలు కల్పించాలని పత్తి కొనుగోళ్లు సీసీఐ ద్వారా మద్దతు ధరలకు పత్తి కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని  సూచించారు. కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడానికి సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు, ఇతర అధికారుల మధ్య సమన్వయం అవసరమని ఆయన అన్నారు. పత్తి కొనుగోలు ప్రక్రియను రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, పారదర్శకంగా, వేగంగా జరిగేలా సంబంధిత శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే సీసీఐ అధికారులు  మిల్లుల యజమానులు రైతులకు తగిన మద్దతు ధర చెల్లించడం, తేమ శాతం (Moisture Content) పరిశీలనలో నిబంధనలు పాటించడం, బరువు తూకం పట్ల సక్రమంగా  వ్యవహరించాలని సూచించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333