యూరియా వచ్చింది 444 బస్తాలుక్యూ లైన్ లో 4వేల మంది రైతులు

Sep 23, 2025 - 18:10
 0  5
యూరియా వచ్చింది 444 బస్తాలుక్యూ లైన్ లో 4వేల మంది రైతులు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ యూరియా వచ్చింది 444 బస్తాలుక్యూ లైన్ లో 4వేల మంది రైతులు రాత్రి నుండి క్యూ లైన్ లో ఉన్న వారికి కాకుండా ఇతరుల కు టోకెన్ లు ఇచ్చారంటూ రాస్తారోకో... పోలీస్ వ్యవసాయ అధికారుల పహరా లో యూరియా పంపిణీ... గ్రోమోర్ పని తీరు పై రైతుల అగ్రహాo... ఆత్మకూర్ ఎస్... యూరియా కోసం రైతులకు కష్టాలు తప్పడం లేదు. సొసైటీలు వ్యవసాయ శాఖ సమన్వయంతో పోలీసులు సహకారంతో శాంతియుతంగా వచ్చిన యూరియా బస్తాల ను అన్నదాతలకు పంపిణీ చేస్తుండగా నెమ్మికల్ మన గ్రోమోర్ యూరియా పంపిణీ లో నిర్లక్ష్యం కారణంగా రైతులు అధికారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత 15 రోజులు క్రితం యూరియా తెప్పించిన మన రైతులకు పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం కారణంగా వివాదాలు తెలుత్తాయి. సోమవారం సాయంత్రం రెండు లారీల యూరియా తెచ్చిన మన గ్రోమోర్ రైతులకు ముందస్తు సమాచారం కానీ టోకెన్లు గాని ఇవ్వకపోవడంతో 444 బస్తాలకు సోమవారం రాత్రి నుండి సోమవారం రైతులు షాపుల ముందు వర్షాలకు తడుస్తూ పడి గాపులు కాయల్సి వచ్చింది. మంగళవారం ఉదయం వేలాదిమంది రైతులు నేమికల్లు మన గ్రోమో ర్ ముందు బారులు తీరారు. వ్యవసాయ అధికారులు పోలీసులు రైతు స్థానిక పిఎసిఎస్ కార్యాలయం ముందు టోకెన్లు ఇచ్చి అనంతరం ఒకో రైతు కు ఒక బస్తా యూరియా పంపిణీ చేశారు. టోకెన్లు ఇవ్వడంలో రాత్రి నుండి వేచి ఉన్న రైతులను కాదని తర్వాత వచ్చిన వారికి ఇవ్వడంతో కొద్దిసేపు మన గ్రూపు కార్యాలయం ముందు నిమ్మికలు దంతాలపల్లి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. పోలీసులు కలగజేసుకొని అదనంగా టోకెన్లు ఇచ్చి తర్వాత వచ్చే లోడ్ కు యూరిన్ పంపిణీ చేసినట్లు తెలిపారు.