దండు మైసమ్మ ఆలయం వద్ద కొబ్బరికాయ 50రూపాయలు

Sep 23, 2025 - 18:11
 0  7

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ దండు మైసమ్మ ఆలయం వద్ద కొబ్బరికాయ 50రూపాయలు కలెక్టర్ కు పిర్యాదు చేసిన గ్రామస్తులు ... ఆత్మకూర్ ఎస్. మండల పరిధిలోని నెమ్మికల్లు శ్రీ దండు మైసమ్మ ఆలయం వద్ద ఇష్టానుసారంగా కొబ్బరికాయలు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఒక కొబ్బరికాయ 50 రూపాయలకు విక్రయిస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని కొబ్బరికాయల కాంట్రాక్టర్ ఆలయ అధికారిపై స్థానికులు జిల్లా కలెక్టర్కు సోమవారం ఫిర్యాదు చేసినట్లు విలేకరులకు తెలిపారు. 2024 డిసెంబర్లో కొబ్బరికాయల వేల పాట ను గుట్టు చప్పుడు కాకుండా హైదరాబాదులో ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయంలో ఆరు లక్షల 98 వేలకు దక్కించుకున్న స్థానిక కాంట్రాక్టర్ రేణుకుంట్ల ఉపేందర్ నిబంధనల ప్రకారం 30 రూపాయలచొప్పున కొబ్బరికాయను చిల్లర షాపులు, పూలు అమ్మే వారికి ఇవ్వాల్సి ఉంది వారు పూలు కుంకుమ పసుపు తో కలిపి 40రూపాయలకు అమ్మాలి ఈనెల 15 నుండి కొత్తగా వచ్చిన ఎండోమెంట్ అధికారి సహకారం తో కాంట్రాక్టర్ 40 రూపాయలకు కొబ్బరికాయను అమ్ముతున్నారని వీరి దగ్గర తీసుకున్న చిల్లర వ్యాపారులు 50 రూపాయలకు భక్తులకు అమ్ముతుండగా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఎండోమెంట్ అధికారి కి ఎన్నిసార్లు ఈ విషయమై ఫిర్యాదు చేసినప్పటికీ విధులకు సక్రమంగా హాజరు కాకపోవడమే కాకుండా సదర్ కాంట్రాక్టర్ పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సోమవారం కాంట్రాక్టర్, ఎండోమెంట్ అధికారి పై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అధిక ధరలకు కొబ్బరికాయలు అమ్ముతున్న కాంట్రాక్టర్ పై అతనికి సహకరి స్తున్న ఎండోమెంట్ అధికారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పిర్యాదు ఇచ్చిన వారిలో మాజీ సర్పంచ్ గోపగాని సత్యం, బుడిగే సైదులు, రేపాక వెంకటరెడ్డి ,గోపాలకృష్ణ, బి వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు.