రైతులు తమ పొలాల్లో నాన్నమైన విత్తనాలు నాటుకుని మంచి పంటలు పండించేందుకు
వ్యవసాయ అధికారులు సహకరించాలి . కలెక్టర్.
జోగులాంబ గద్వాల 14 జులై 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి: గద్వాల. జిల్లాలోని రైతులు తమ పొలాల్లో నాణ్యమైన విత్తనాలు నాటుకొని మంచి పంటలు పండించేందుకు వ్యవసాయ అధికారులు సహకరించాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ ఆదేశించారు. శనివారం ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయ శాఖ అధికారులతో ప్రస్తుత వ్యవసాయ సీజనల్ పరిస్థితి పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు ఎన్ని ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు, ఏ పంటలు ఎక్కువగా సాగు చేశారని అడిగారు. ఇప్పటిదాకా కురిసిన వర్షపాతం వివరాలు, ప్రస్తుతం పంటలు ఏ దశలో ఉన్నాయో అడిగారు. వ్యవసాయ అధికారులు స్పందిస్తూ జిల్లాలో పత్తి, వరి, మిరప, కందులు ఎక్కువగా సాగు చేశారని, రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ఎకరానికి ఎన్ని విత్తనాలు, ఎరువులు వాడుతున్నారని, నీటి లభ్యత వివరాలను మండలాల వారిగా అడిగి తెలుసుకున్నారు. క్రాప్ బుకింగ్ ఎంత వరకు అయిందాని అడిగి తెలుసుకున్నారు. ఫీల్డ్ కు వెళ్లి క్రాప్ బుకింగ్ త్వరగాతిన చేయాలన్నారు. గత ఏడాది జులై ,ఆగస్టులో ఫర్టిలైజర్ దుకాణాల నుంచి రైతులు ఎంత మేర విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేశారో సోమవారంలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ఏడీయేలు వెంకటలక్ష్మి, సక్రియ నాయక్, సంగీతలక్ష్మి, ఆయా మండలాల ఏవోలు, తదితరులు పాల్గొన్నారు.