యువత పెడ దోరను లను అరికట్టకపోతే భవిష్యత్తు అంధకారమే

Sep 17, 2025 - 08:27
 0  5

మధ్యము, మత్తు పదార్థాలతోపాటు సంఘ విద్రోహశక్తులుగా మారడం సమాజానికి ఎంతో నష్టం.వాళ్ల విద్రోహ చర్యలపై ఉక్కు పాదం మోపాలి.

ప్రజాకoటకులుగా గుర్తించి చర్యలు తీసుకోవాలి.*

*****************************************

-- వడ్డేపల్లి మల్లేశం 9014206412

---03....03....2025""""""""""""""""""""""

ఇటీవల సంఘవిద్రశక్తులుగా సమాజంలో కొనసాగుతున్న కొంతమంది యువత పట్ల పోలీసు ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా సంస్కరణ కోసం కొన్ని సూచనలు చేసిన విషయాన్ని కూడా మనం సామాజిక మాధ్యమాలలో గమనించవచ్చు. అంటే యువత ఏ రకంగా సమాజం మను గడకు ద్రోహం తలపెడుతున్నదో అర్థం చేసుకోవచ్చు. కష్టపడి అరకొర సౌకర్యాల మధ్యన తల్లిదండ్రులు పిల్లలను చదివించి విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలోకి పంపడానికి ప్రయత్నిస్తే యువత మాత్రం అందుకు భిన్నంగా వికృత వేషధారణ, మధ్యము, మతుపానియాలు, ధూమపానము, ఆన్లైన్ ఆటలతో సంఘవిద్రశక్తులుగా మారడమే కాకుండా తల్లిదండ్రులకు కునుకు లేకుండా చేస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితులను పోలీసు వ్యవస్థ దృ డ హస్తంతో అణచివేయవలసిన అవసరం చాలా ఉన్నది. ప్రపంచంలోనే యువత ఎక్కువగా ఉన్న దేశం భారతదేశం అని గర్వంగా చెప్పుకున్నప్పటికీ ఆ యువతలో ఎక్కువ భాగం తల్లిదండ్రుల యొక్క కష్టసుఖాలను గుర్తించకుండా, ఇంటి పరిస్థితులను అర్థం చేసుకోకుండా, బలవంతంగా బెదిరించి లొంగదీసుకుని,వాహనాలు సమకూర్చుకొని, మద్యానికి బానిసగామారి మాన ప్రాణానికితెగించి ఇతర అసాంఘిక కార్యకలాపాలకు అలవాటు పడి తల్లిదండ్రుల ఆవేదనకు ఆందోళనకు కారణం అవుతున్న దుస్థితిని గమనించాలి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇటీవల ఒక పోలీసు ఉన్నతాధికారి ఆందోళన వ్యక్తం చేస్తూ వారి అభిప్రాయాలను మీడియాలో ప్రచురించిన విషయాన్ని గమనించవచ్చు. అంటే తల్లిదండ్రుల కంటే మిన్నగా పోలీసు వ్యవస్థ సమాజం బ్రష్టు పట్టి పోవడాన్ని ఆవేదనతో అర్థం చేసుకున్న తీ రును మనం కూడా అర్థం చేసుకోవాలి. వాహనాలు సమకూర్చుకోవడం, డబ్బులను బలవంతంగా లొంగదీసుకోవడం, తాగుడుకు బానిసలు కావడం, తల్లిదండ్రులను బెదిరించడం వంటి అసాంఘిక పరిస్థితులలోకి యువత దిగజారి పోతూ ఉంటే ఇప్పటికే అరకొర శాంతి భద్రతలతో కొనసాగుతున్న వ్యవస్థ మరింత దిగజారే ప్రమాదం లేకపోలేదు. 

  భవిష్యత్తును కాపాడుకోవాలి 

*****************************

మానవ వనరుల తో పాటు ప్రకృతి వనరులను కాపాడుకోవడం, వాటిని మానవ అవసరాలకు వినియోగించుకోవడం ద్వారా అభివృద్ధిని సాధించవలసిన అవసరం ఉన్నది. దీనికే ఇటీవల నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ మానవాభివృద్ధి అనే పదాన్ని వినియోగించడం మరింత ప్రాధాన్యత సంతరించుకున్నది. ప్రజలను ప్రధాన వనరుగా గుర్తించినటువంటి సందర్భాన్ని 1991 నుండి కేంద్రంలో మానవ వనరుల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన విషయం మనందరికీ తెలుసు. ప్రపంచంలోనే యువత ఎక్కువగా ఉన్న దేశంగా భారతదేశానికి పేరు ఉన్నది ఆ యువతలో ఎక్కువ భాగం ప్రధాన జీవన స్రవంతిలో ఉన్నప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి చెందడానికి, చరిత్రలో మహానుభావులు కన్న కలలు నిజం చేయడానికి ఆస్కారం ఉంటుంది. సినిమాలు సీరియళ్లలో చూపిస్తున్నటువంటి వికృత చేష్టలు, యువత పెడదో రనులు అసాంఘిక కార్యకలాపాలతో సమాజానికి నష్టం చేస్తున్న తీ రు ఆందోళనకరంగా పరిణమించినప్పటికీ తల్లిదండ్రులు గాని చట్టాలు గానీ వారిని అదుపు చేయడం లేదు. ప్రత్యేక చట్టాల ద్వారా చెడు మార్గంలో పయనిస్తున్నటువంటి యువతపై ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది.. ఎందుకంటే వారి వలన మిగతా పని చేస్తున్నటువంటి సమాజానికి మేలు చేస్తున్న వాళ్లు కూడా అక్రమార్కులుగా తయారయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇలాంటి దుర్మార్గులు కుటుంబాన్ని గౌరవాన్ని కాపాడరు, బయట సమాజంలో కూడా గౌరవంగా బ్రతకలేరు, అంతేకాకుండా దేశాభివృద్ధికి ఆటంకముగా పరిణమిస్తున్నటువంటి సందర్భాలను పురస్కరించుకొని అవకాశాల మేరకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది..తద్వారా కుటుంబంలో సవ్యంగా పనిచేసుకోవడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చడంతో పాటు జాతీయ ఆదాయంలో కూడా పాలుపంచుకునే అవకాశం ఉంటుంది.అంతేకాదు సమాజానికి విద్రోహం తలపెట్టే వికృత చేష్టలు, వికృత ఆకారాలను కూడా అదుపు చేసిన వాళ్ళం అవుతాము. మధ్యము, ధూమపానము, వికృత రీతిలో కట్టింగు, వికృత ఆకారంలో బట్టలు, నడక, ముఖ కవళికలు గల వాళ్లను సంఘవిద్రోహశక్తులుగా కనిపించేలా చేస్తున్నాయి. ఇలాంటి చేష్టలతో, ఆకారాలతో సంఘవిచ్చిన్న శక్తులుగా కనపడుతూ వ్యవస్థకు ద్రోహం చేస్తున్న వారిపైన ఉక్కు పాదం మోపాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా లక్షలాదిమంది ఎలాంటి పనులు చేయకుండా ఉత్పత్తిలో భాగస్వాములు కాకుండా తల్లిదండ్రులకు భారంగా పరిణమిస్తూ అసాంఘిక శక్తులుగా మారుతున్న సందర్భం జాతి అభివృద్ధికి ఎంతో విఘాతం. ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి కొన్ని అవకాశాలు కూడా ఈ దుస్థితికి కారణం. ప్రభుత్వం వెంటనే మద్యపానం, ధూమపానం, మత్తు పదార్థాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాల పైన ఉక్కు పాదం మోపి నిషేధించాలి. తద్వారా యువతను జనజీవన స్రవంతిలో చేర్చడం ద్వారా అభివృద్ధిలోనూ ఉత్పత్తిలోనూ దేశ సంపదను పెంచడంతోపాటు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో పాటు అసమాన తలను తగ్గించడానికి సమసమాజ స్థాపన వైపుగా పయనించడానికి ఆస్కారం ఉంటుంది. జనాభాలో మెజారిటీ భాగమైన యువత పెడదారి పట్టినప్పుడు ఉత్పత్తిలో గానీ సంపదలో కానీ అభివృద్ధిలో కానీ వెనుకబడి పోయే ప్రమాదం ఉంది కదా! ఈ మాత్రం అవగాహన లేనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్లబ్బులు పబ్బులు ఈవెంట్లు మద్యపానం ధూమపానం వంటి అసాంఘిక కార్యకలాపాలను పెంచి పోషించడం అంటే జాతి ప్రయోజనాలను కా వాలని దెబ్బతీస్తున్నాయంటే పాలకుల యొక్క దుందుడుకుతనాన్ని బాధ్యతారాహిత్యాన్ని అర్థం చేసుకోవచ్చు. అక్రమ మార్గాల ద్వారా వచ్చే ఆదాయం తోని దేశాన్ని పరిపాలించాలనే దుర్మార్గపు ఆలోచనకు ప్రభుత్వాలు స్వస్తి పలకాలి. జనాభా మొత్తాన్ని సన్మార్గమైన ఉత్పత్తిలో భాగస్వాములను చేయడం ద్వారా దేశ ఆర్థిక పరిస్థితిని పునరుద్ధరించుకోవడం అన్ని రకాల అవసరాలను సమకూర్చుకోవడం దిగుమతులపై కాకుండా ఎగుమతుల పైన దృష్టి సారించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇదంతా యువత జనజీవన స్రవంతిలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది.

          విద్యారంగంలోనూ సామాజిక రాజకీయ రంగంతో పాటు యువతను ప్రభావితం చేసేటువంటి అంశాల పైన పాలకులు దృష్టి సారించాలి. సిలబస్లో కూడా యువతను సక్రమ మార్గంలో నడిపించే కృషి కొనసాగించాలి. సామాజిక మాధ్యమాలలో చూపించే సన్నివేశాలు యువతను ప్రోత్సహించే విధంగా ఉత్పత్తిని పెంచే విధంగా ఉండాలి. ముఖ్యంగా సినిమాలు టీవీ ప్రసారాలు అందుకు భిన్నంగా ఉండడం వలన యువత పెడదారి పట్టడానికి కారణం అవుతున్నది. అలాంటి అసాంఘిక కార్యకలాపాలను టీవీ ప్రసారాలు సినిమాలలో నిషేధించడం ద్వారా మద్యపానం ధూమపానం మత్తు పదార్థాలను తరిమి కొట్టడం ద్వారా మాత్రమే ఈ దేశంలో అభివృద్ధిని శాంతి సుస్థిరతనుకాపాడి అసాంఘిక పరిస్థితులను కట్టడి చేయడానికి ఆస్కారం ఉంటుంది. దీనికి ముఖ్యంగా ప్రభుత్వాలలో చిత్తశుద్ధి, సామాజిక బాధ్యత, దేశం పట్ల ప్రజల పట్ల అనురాక్తి ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. విద్యారంగంలో సిలబస్ లో కూడా అలాంటి అంశాలను చేర్చడం ద్వారా శ్రమ పట్ల గౌరవం, ఉత్పత్తి పట్ల బాధ్యత, దేశం పట్ల సేవా దృక్పథం పెంపొందించే అవకాశం ఉంటుంది అప్పుడే ప్రజా, అభ్యుదయ అనుకూల పరిస్థితులను చూడగలము.

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడుఅరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333