మొక్కుబడి సాహిత్యానికి కాలం చెల్లింది.

Apr 2, 2025 - 23:49
 0  1

మొక్కుబడి సాహిత్యానికి కాలం చెల్లింది. యుద్ధ వీరుల్లాగా సామాజిక రుగ్మతలపైన సమరం చేయడమే కవులు కళాకారుల సామాజిక బాధ్యత

 కేవలం వర్ణనకు మొక్కుబడి సాహిత్యానికి పరిమితమైతే రచయితలు కవులు కళాకారులు దీర్ఘకాలంలో రాణించలేరని, సామాజిక ప్రయోజనాలు నెరవేర్చని సాహిత్యం సమాజానికి చేసే ద్రోహం వంటిదని, సామాజిక రుగ్మతల పైన సమరభేరి మ్రోగించేదే నిజమైన సాహిత్యమని, అందుకు యుద్ధ వీరుల్లాగా పోరాడ టమే కవులముందున్న కర్తవ్యం అని అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు, ద్వి సహస్రాధిక వ్యాసకర్త, రాజకీయ సామాజిక విశ్లేషకుడు వడ్డేపల్లి మల్లేశం సాహితీ లోకానికి పిలుపునిచ్చారు.

హుస్నాబాద్ లో విశ్వావసు నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం ఆదివారం రోజున పెన్షనర్స్ భవన్లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొంటూ వడ్డేపల్లి మల్లేశం సామాజిక ప్రజా సమస్యలను సవాల్గా తీసుకొని వాటికి పరిష్కార మార్గాలను చూపే విధంగా సాహిత్యాన్ని సృష్టించాలని ప్రజలు మెచ్చే, ప్రజలకు అనుకూలమైనటువంటి రచనలు చేయడం ద్వారా సామాజిక మద్దతును కూడా కట్టాలని అలాంటి చర్చలు సంప్రదింపులకు ఇలాంటి కవిసమ్మేళనాలు వేదిక కావాలి కానీ కేవలం మొక్కుబడి వేదికలుగా మిగిలితే ప్రయోజనం శూన్యం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. మొహమాట పడడం, ప్రశంసలకు పొంగిపోవడం, పరస్పర పొగడ్తలకు సాహిత్యంలో స్థానం ఉండదని వాస్తవ అంశాల ప్రాతిపదికన కార్యకారణ సంబంధం పునాదిగా రచనలు చేయాలని ఆయన కవులను కోరారు. కళారూపాల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించేది కళాకారులైతే ప్రజా సమస్యల పైన లోతైన చర్చ జరపడంలో కవులు, మేధావులు, సామాజిక చింతన గల వాళ్లు, వక్తలు జర్నలిస్టులు ప్రజా సంఘాల ప్రతినిధులు సాహిత్య రంగానికి బాసటగా నిలవాలని ఆయన కోరారు. ప్రజల హితాన్ని కోరేది సాహిత్యమైనప్పటికీ అంతటితోనే సరిపోదని కవులు ఆ హితాన్ని ప్రజలకు సమకూర్చడంలో అవసరం అయితే పోరాటానికి సిద్ధం పడాలని కాలానుగుణంగా సాహిత్యం యొక్క నిర్వచనం కూడా మారుతుందని ఆ క్రమంలో కవులు రచయితలు తమ పాత్రలను సమీక్షించుకోవాలని ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

 వడ్డేపల్లి మల్లేశం

అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333